మరో పది రోజుల్లో కొత్త ఏడాది పలుకరించబోతుంది. కొత్త సంవత్సరం వేడుకలంటే కుర్రకారులో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకోసం యూత్ ఆకట్టుకునేందుకు ఈవెంట్ మేనేజ్‌మెంట్‌సంస్థలు రెడీ అవుతున్నాయి. యువతను ఆకట్టుకునేందు ప్రకటనలు గుప్పిస్తున్నాయి.. వేడుకల మాటున ఆసాంఘిక కార్యకలపాలు జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. గంజాయి, డ్రగ్స్ లాంటివి కూడా చేతులు మారుతుంటాయన్న ప్రచారం నేపథ్యంలో పోలీస్ యంత్రాంతం అప్రమత్తమైంది. మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు ముమ్మరంచేశాయి. ఈ నెల 31న రాత్రి కొత్త సంవత్సర వేడుకలు నిర్వ హించే హోటళ్లు, పబ్‌లు, స్టార్ హోటళ్లు, క్లబ్బులు, ఈవెంట్ సంస్థలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రోడ్డుపైనే భార్యాభర్తల ఫైటింగ్.. వీడియో వైరల్.. 4 లక్షల వ్యూస్
ఇవి పాటించాల్సిందేః
త్రీ స్టార్, ఆపై హోటళ్లు, క్లబ్బులు, బార్, రెస్టారెంట్లు/పబ్‌లు 31న అర్ధరాత్రి ఒంటిగంట వరకు మా త్రమే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి.
10రోజులకు ముందే నగర పోలీసుల, సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవాలి.
ఉత్సవాల ప్రదేశాల్లో, లోపల/బయటకు వెళ్లే మార్గాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
సరిపడినంత భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లుండాలి.
సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అసభ్య, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు.
సంగీతం, శబ్దం 45 డెసిబుల్స్ మించకూడదు.
బాణసంచా, పేలుడు పదార్థాలకు అనుమతి లేదు.
వేడుకల్లో నిషేధిత మాదకద్రవ్యాలను అనుమతించే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
మోతాదు మించితే కేసు
వాహనాలు నడిపేప్పుడు రక్తంలో మద్యం నిర్ణీత మోతాదు మించితే కేసు నమోదు చేస్తారు. రూ.10,000 జరిమానా/6నెలల జైలుశిక్ష విధించవచ్చు.
సురక్షితంగా ఇల్లు చేరేందుకు ‘డిజైన్డ్ డ్రైవర్ ఫర్ ఏ డే’ సహాయకులను ఉపయోగించుకోవాలి. అన్ని నిబంధనలను ఈవెంట్ నిర్వాహకులు ప్రధాన ద్వారం వద్ద ప్రదర్శించాలని సీపీ స్పష్టంచేశారు.