భార్యాభర్తలన్నాకా నిత్యం ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. ఎన్ని గొడవలు జరిగినా ఇంట్లోనే జరుగుతుంటాయి. మరి ముదిరితే పెద్దమనుషుల మధ్య పంచాయతీలో జరుగుతాయి. కానీ ఇక్కడో గొడవ నడి రోడ్డుపైనే జరిగింది. వెళ్తున్న కారును రోడ్డుపై ఆపిన భర్త వెనుక సీట్లో కూర్చున్న భార్య చిన్నబాబును కిందికి గుంజి పడేస్తాడు. లోపలకెళ్లి కూర్చుంటాడు. భార్య చేతిలోని బాబును రోడ్డుపైనే వదిలేసి వెనక సీట్లో గొడవపడుతుంటారు. రోడ్డుపైనే పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తుండడంతో వేరొక వ్యక్తి వచ్చి బాబును దగ్గరకు తీసుకుంటాడు. ఇదంతా వీడియో తీసి ఒకరు సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడు మనిషేనా అంటూ ఒకరు… ఇలా చేయడం దారుణం అంటూ కామెంట్ చేస్తున్నారు.
The way people dont care for their babies is wild!!! pic.twitter.com/VfYS85RLsR
— Wild content (@NoCapFights) December 13, 2023
‘ధోనీ’కి ఇదే చివరి ఐపీఎల్..? కారణాలు ఇవే
రాష్ట్రంలో 20మంది ఐపిఎస్‌ల బదిలీ… డిజిపిగా రవిగుప్తా కొనసాగింపు
రాష్ట్రంలో 20మంది ఐపిఎస్‌ల బదిలీ… డిజిపిగా రవిగుప్తా కొనసాగింపు