చైనాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి సుమారు 116 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడనట్లు స్థానిక విూడియా తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ విూడియా వెల్లడించింది. చైనాలోని వాయువ్య ప్రాంతమైన గన్సుకి పది కిలోవిూటర్ల లోతులో 6.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు చైనా భూకంప నెట్‌వర్క్ కేంద్రం తెలిపింది. చైనా రాజధాని బీజింగ్‌కు నైరుతి దిశలో 1,300 కిలోవిూటర్ల దూరంలో భూకంప కేంద్రం పేర్కొంది. అర్థరాత్రి తర్వాత మంగళవారం ఉదయం పది గంటల సమయంలో వరుస ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. భూకంపం ధాటికి గన్సు, క్వింఘై ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు విూడియా పేర్కొంది.
సీరియల్ కిల్లర్ బృందం అరెస్ట్ వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ
భూకంప తీవ్రత 5.9గా రికార్డయినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భవనాలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, నీరు, విద్యుత్ , కమ్యూనికేషన్ లైన్లు ధ్వంసమైనట్లు తెలిపింది. గన్సులో 105 మంది మరణించగా, మరో 397 మంది గాయపడ్డారని, వీరిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉందని ప్రావిన్షియల్ ఎమ్జ్గంక్ష్మిన్సీ మేనేజ్‌మెంట్ విభాగం ప్రతినిధి హాన్ షుజన్ ఓ ప్రకటనలో తెలిపారు. క్వింఘై ప్రావిన్స్‌లో 11 మంది మరణించగా, సుమారు 140 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపట్టాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించారు. తక్షణ సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, గాయపడినవారికి తక్షణమే చికిత్స అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. భూకంపం ప్రభావంతో సంభవించే మార్పుల వల్ల పరిస్థితులు దిగజారకుండా చూడాలన్నారు. కాగా, ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 15 నుండి మైనస్ 9 డిగ్రీలకు పడిపోయినట్లు చైనా వాతావరణ యంత్రాంగం తెలిపింది. సహాయక చర్యల్లో భాగంగా 4,000 మంది అగ్నిమాపక సిబ్బంది, సైనికులు, పోలీసులను పంపారు. ఆ ప్రాంతంలో కమాండ్ పోస్టను ఏర్పాటు చేసినట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్టన్ర్ థియేటర్ పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో చైనాలోని నైరుతి ప్రావిన్స్ సిచువాన్‌లో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 74 మంది మరణించారు.
బీఆర్ఎస్ ను బీజేపీకి ‘బీ’ టీమ్ అని అందుకే అంటారు కేటీఆర్.. కర్ణాటక సీఎం రీ ట్వీట్