పోలీస్ అంటేనే ధైర్యసాహాసలతో ముందుకెళ్తారు. తమ చుట్టు ఏం జరుగుతుందో గమనిస్తూ ప్రజా శ్రేయస్సుకు నిత్యం పాటుపడుతుంటారు. తమపరిధిలోని పని కాకపోయినా తమ ముందు అనుకోని ఘటనలు జరుగుతుంటే మాత్రం చూస్తు ఊరుకుండరు. అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఎర్రమంజిల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో అకస్మాత్తుగా పొగ వ్యాపించింది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్నట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ గౌడ్ అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టాడు. అందులో చిక్కుకున్న కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చి కాపాడాడు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రవణ్‌గౌడ్‌ను అందరూ అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను Hyderabad Traffic Police ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు.
#HYDTPweCareForU
Today, around 7.30 AM #FireAccident occurred at the Penthouse of Jade Blue showroom at Panjagutta. Immediately B. Shravan Goud of Panjagutta TrPS along with PCO Satyanarayan & HGO Ram Reddy of @shopanjagutta rushed to spot & saved the family by breaking the door. pic.twitter.com/MhnKTcwMgK— Hyderabad Traffic Police (@HYDTP) December 22, 2023
లోక్ సభ స్థానాలన్నీ గెలవాలి కేటీఆర్