Sunday , 19 January 2025
Breaking News

లోక్ స‌భ స్థానాల‌న్నీ గెల‌వాలి కేటీఆర్

రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రానున్న లోకసభ ఎన్నికలపై దృష్టిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో కార్యకర్తల్లో కొంత ఆత్మస్థైరం తగ్గింది. 39 సీట్లతో బీఆర్ ఎస్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే ప్ర‌జ‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ మీద కొంత వ్య‌తిరేక‌త ఉన్న‌ద‌ని కేటీఆర్ దృష్టికి వెళ్లింది. ఈ పరిణామాల దృష్ట్యా హైదరాబాద్‌లో కార్పొరేటర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగిరేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడకుండా ప్రజల తరఫున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్రను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోనూ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని అయితే హామీలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో సీట్లు తగ్గడం పట్ల ఎవరూ అధైర్యపడవొద్ద‌న్నారు. తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాలను గెలవాలని పార్టీశ్రేణుల‌కు దిశానిర్ధేశం చేశారు. శక్తివంచన లేకుండా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కాగా కొందరు అసెంబ్లీ ఎన్నికల్లోనే సీట్లు కోల్పోయారు. లోకసభ ఎన్నికల్లో పోటీచేసినా ఫలితం ఉండదని, బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని పబ్లిక్‌ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే మహారాష్ట్రకు వెళ్లండని పోస్టులు పెడుతున్నారు.

చ‌లిని త‌ట్టుకోవ‌డానికి ఇత‌డేం చేశాడో వీడియో చూడండి

1000 కోట్లు కొట్టేదెవరు..? బాలీవుడ్‌లో చ‌ర్చ‌

న్యూ ఇయ‌ర్ నిబంధనలు ఇవే..

About Dc Telugu

Check Also

19.01.2025 D.C Telugu Cinema

Smart TV

Sony Smart TV” స్మార్ట్ టీవీల‌పై బంప‌ర్ ఆఫ‌ర్‌… ఇప్పుడే కొనండి..

Sony Smart TV”  సోనీ బ్రావియా 2 సిరీస్ 108 సెం.మీ (43 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ …

One Plus

One Plus Phones”వ‌న్‌ప్ల‌స్ 13 ఆర్ ఏఐతో స్మార్ట్ ఫోన్‌..

One Plus Phones” వ‌న్‌ప్ల‌స్ (OnePlus) 13R | వ‌న్‌ప్ల‌స్ (OnePlus) ఏఐ(AI) తో మరింత స్మార్ట్ (12GB రామ్‌(RaM), …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com