హోరాహోరీగా క్రికెట్ పోటీలు
-ముగిసిన రాష్ట్రస్థాయిపటేల్ క్రికెట్ లీగ్ పోటీలు
– – విజేతలకు ముఖ్య అతిథులు
బహుమతులు ప్రధానం
కరీంనగర్. డీసీ ప్రతినిధి
తెలంగాణ మున్నూరు కాఫు జర్నలిస్టుల ఫోరం , పటేల్స్ యూత్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన పోటీలు క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన క్రికెట్ అభిమానులు కేరింతలతో ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. టోర్నీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన లీగ్ పోటీలు రసవత్తరంగా సాగాయి. టోర్నీలో భాగంగా తెలంగాణ మున్నూరు కాఫు జర్నలిస్టుల ఫోరం, కరీంనగర్ అడ్వకేట్స్ అసోసియేషన్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ మ్యాచ్ ఆకట్టుకుంది. ప్రధానంగా చివరి రోజు శనివారం నిర్వహించిన క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆధ్యంతం ఉత్కంఠను రేపాయి. ఆటగాళ్లు విజృంభిచి క్రీడా భిమానులను అలరించారు.
సెమీఫైనల్స్ లో కామారెడ్డి జట్టు వరంగల్ జట్టు పై కామారెడ్డి జుట్టు
విజయం సాధించింది. మరో సెమీ ఫైనల్ లో జగిత్యాల జట్టు పై హుజూరాబాద్ జట్టు పై జగిత్యాల జుట్టు గెలుపొందింధి. అనంతరం జరిగిన ఫైనల్స్ లో జట్టు పై కామారెడ్డి జట్టు పై జగిత్యాల జుట్టు 7పరుగుల తేడాతో గెలుపొంది ట్రోఫీ సొంతం చేసుకుంది. జగిత్యాల జట్టులోని క్రాంతి పటేల్ క్రీడాకారుడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందజేశారు.
ఎంపైర్లు ఓం ప్రకాష్, గాండ్ల శేఖర్ ,నరేందర్ ,రాము సాకేత్ పటేల్ నవీన్ పటేల్ అఖిల్ పటేల్ వ్యవహరించారు.
అనంతరం నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవంలో అఖిలభారత ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులుగా మారం జగదీశ్వర్ , తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి , బొమ్మకల్ సర్పంచ్
పురమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ
క్రీడలతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, మున్నూరు కాపు యువత అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఐక్యత నే బలం అన్నారు. క్రీడలతోపాటు సేవా కార్యక్రమంలో ముందుండాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపులు చేపట్టే ఇలాంటి కార్యక్రమానికైనా తమ వంతు సహకారం ఉంటుందని చెప్పారు. ఇలాంటి క్రీడలు అన్ని జిల్లాలో నిర్వహించాలని కోరారు.
అనంతరం – తెలంగాణ మున్నూరు కాఫు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్థులు అన్ని రంగాల్లో సత్తా చాటాలని, మున్నూరు కాపు యువత క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. ఇందులో భాగంగానే క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే వాతావరణాన్ని నిర్మించాలని క్రికెట్ టోర్నీ నిర్వహించినట్లు చెప్పారు. సామార్థ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించి మున్నూరు కాపు కుల భాందవులు సహాయ సహకారాలు అందించాలని, ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలని కోరారు. క్రీడలకు పెద్దపీట వేయాలని, క్రీడా సౌకర్యాలను మెరుగు పర్చాలని అన్నారు. క్రీడలతో స్నేహ భావం పెంపొందుతుందని, క్రమ శిక్షణ అలవడుతుందని అన్నారు. క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుంటే అరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని, స్నేహ భావాలు పెంపొందుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శి సూదుల వెంకటరమణ పటేల్, గౌరవ అధ్యక్షులు బోనాల తిరుమల్ పటేల్, బోనాల మల్లికార్జున పటేల్, కోశాధికారి తోటరమణ పటేల్, ఉపాధ్యక్షులు సుమ పటేల్, బండి రఘు పటేల్, గంగాధర్ పటేల్, బోనాల వెంకటేష్ పటేల్, కార్యవర్గ సభ్యులు రాచమల్ల సుగుణాకర్ పటేల్, పోకల మధు పటేల్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు వంగళ రమేష్ పటే ల్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం బద్దిపల్లి అధ్యక్షులు రాచమల్ల కరుణాకర్ పటేల్ , పటేల్ యూత్ ఫోర్స్ టీం సభ్యులు అఖిల్, అభిషేక్, అనుదీప్ ,రామ్, నిఖిల్ ,శ్రీనివాస్ము న్నూరుకాపు యువత పాల్గొన్నారు