సంక్రాంతి పండుగ సెలవుల్లో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో శనివారం విద్యుత్ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు తనిష్క్ మృతి చెందాడు. సంక్రాంతి సెలవులు కావడంతో గాలి పటాలు ఎగుర వేసేందుకు తన ముగ్గురు స్నేహితుల తో కలిసి ఇంటిపైకి వెళ్లాడు. ఈ క్రమంలో గాలిపటం విద్యుత్ వైర్లకు తగిడంతో కరెంట్ షాక్‌తో గురయ్యాడు. దీంతో బాలుడు అక్కడే కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన తనిష్క్ ను దవాఖానాకు తరలించారు. కానీ అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాలిపటం ఎగురవేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పిల్లలకు సూచించారు.