Former CM Kcr” తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. గాయం నుంచి మెల్ల మెల్లగా కోలుకుంటున్నారు. తాజాగా కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి వీడియో సోషల్ విూడియాలో చక్కర్లు కొడుతోంది. మొన్నటి వరకు బెడ్‌కే పరిమితం అయిన కేసీఆర్.. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. వైద్య సిబ్బంది సహాయంతో ఆయన నిదానంగా నడుస్తున్నారు. పక్కనే వైద్య సహాయకుడు ఉండగా.. ఊతకర్ర సాయంతో (Former CM Kcr) కేసీఆర్ మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తున్నారు. ఇంటి హాల్ మొత్తం నడిచారు. ఊతకర్ర పట్టుకుని కేసీఆర్ నడుస్తుండగా.. తీసిన వీడియోను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ షేర్ చేశారు. దీంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరడిపోతున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని, ప్రజల్లోకి రావాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. డిసెంబర్ 8న కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో కాలు జారి కింద పడగా.. తుంటి ఎముక విరిగిపోయింది. దాంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేసి తుంటి ఎముక రీప్లేస్ చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత 8 వారాల పాటు రెస్ట్ అవసరం అని వైద్యులు చెప్పగా.. హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంట్లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో
అవసరమైన చికిత్స తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ త్వరగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా ఆయన నడుస్తున్న వీడియోను సంతోష్ కుమార్ షేర్ చేశారు. జూబ్లీహిల్స్ నందినగర్ లో విశ్రాంతి తీసుకున్న (Former CM Kcr) కేసీఆర్.. ఆరోగ్యం కుదటపడడంతో మళ్లీ ఫామ్ హౌస్ షిప్ట్ అయ్యారు. అక్కడే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు (Former CM Kcr) కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, సహాయకులు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఊత కర్ర సాయంతో నడక ప్రాక్టీస్ చేస్తున్నారు. గత ఆదివారం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఎవుసం చేసుకుంటానని, అవసరమైన ఎరువులు పంపాలని ములుగు మండలం వంటిమామిడిలోని ఎరువుల వ్యాపారి ఏనుగు బాపురెడ్డికి(Former CM Kcr) కేసీఆర్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం బాగుందని, గజ్వేల్ వస్తానని… అందరిని కలుస్తానని చెప్పారు.
తుంటి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరిగి కోలుకుంటున్నారు.
వైద్యుల సూచనల మేరకు గత ఆరు వారాలుగా సంబంధిత వ్యాయామం చేస్తూ విశ్రాంతి తీసుకుంటూ శక్తిని పుంజుకుంటున్న కేసీఆర్, వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో నడవడం… pic.twitter.com/eyCpDrtbnc
— BRS Party (@BRSparty) January 17, 2024
Also read
KTR’s Tweet” కెసిఆర్‌కే ఎందుకు ఓటేయాలి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్