Flying Kites” సంక్రాంతి పండగ పలువురి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఎంతో ఉత్సాహంతో గాలిపటాలు ఎగురవేసిన పలువురు యువకులు, చిన్నారులు అనుకోకుండా మృత్యువు బారిన పడ్డారు. కొందరు గాలిపటాలు విద్యుత్ తీగలకు ఇరుక్కోవడంతో వాటిని తీస్తుండగా విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోగా, మరికొందరు (Flying Kites)గాలిపటాలు ఎగురవేస్తూ భవనాల పైనుంచి పడి మృతి చెందారు. దీంతో తెలంగాణ గాలిపటాల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో పతంగులు ఎగురవేస్తూ ఓ యువకుడు బలి అయ్యాడు. అలాగే యాప్రాల్‌లోనే గాలిపటం ఎగురవేస్తూ భువన్ సాయి అనే బాలుడు నాలుగవ అంతస్తు పైనుంచి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటు మధురానగర్‌లోనూ విషాదం చోటు చేసుకుంది. (Flying Kites) పతంగులు ఎగురవేస్తూ చౌహన్ దేవ్ (23) అనే యువకుడు మృతి చెందాడు. మధురానగర్ రహ్మత్‌నగర్‌లోని ఐదంతస్తుల భవనం పైనుంచి పడిపోవడంతో చౌహన్ దేవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే చౌహాన్ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చౌహాన్ స్నేహితులపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలా సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో వరుస విషాదాలు ఆయా కుటుంబాలను కలచివేశాయి. ఇప్పటివరకు గాలిపటాలు ఎగురవేస్తూ 9మంది మృతి చెందారు. రహ్మత్‌నగర్‌లో స్నేహితు లతో కలిసి (Flying Kites) గాలిపటాలు ఎగరవేయడానికి వెళ్లిన కపిల్ దేవ్ (23) అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి ప్రమాదశాత్తూ కిందపడి మృతి చెందాడు. అతడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురు స్నేహితుల ప్రమేయంపై అనుమానంతో కుటుంబ సభ్యులు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా మంగళవారం ఒక్క రోజే ఇద్దరు మృతి చెందారు.
సంగారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఝరాసంగం మండలం పొట్ పల్లిలో గాలిపటం ఎగరవేస్తూ కరెంట్ షాక్‌తో యువకుడు శివకుమార్(22) మృతి చెందాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా శివకుమార్ తన ఇంటి వద్ద గాలిపటం ఎగురవేశాడు. అయితే (Flying Kites) గాలిపటం ఎగురుకుంటూ వెళ్లి విద్యుత్ తీగలకు ఇరుక్కుంది. దీంతో శివకుమార్ గాలిపటాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. విద్యుత్ షాక్‌తో శివ చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించేలోగా మార్గమధ్యలోనే యువకుడు శివకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. పండగ పూట ఎంతో ఉల్లాసంగా ఆడుతున్న తమ కుమారుడు ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Social media viral videos” ఇదేందయ్యా… ఇంతకు తెగించారా.. కఠిన చర్యలు తీసుకోవాలి..
బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
బిడ్డ మృతికి అల్లుడే కారణమని కొట్టి చంపిన్రు..