జంతువులకు ఆహారం పెట్టడమన్నా.. వాటితో ఆడుకోవడమన్నా చిన్న పిల్లలకు భలే సరదా. అందుకే చిన్నపిల్లలు ఎక్కువగా జంతువులను ఇష్టపడుతుంటారు. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. జీరాఫికి ఆహారం పెట్టేందుకు ప్రయత్నించిన పిల్లాడిని ఆమాంతం పైకి లేపడంతో ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బుడ్డోడు తన తల్లిదండ్రులతో కలిసి జూలోని జంతువులను చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఓ జిరాఫీకి ఆహారం పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో నోటితో ఆహారాన్ని అందుకున్న ఆ జిరాఫి ఆ ఆకును పైకి తీసుకుంది. కానీ పిల్లవాడు మాత్రం దాన్ని గట్టిగా పట్టుకోవడంతో అలాగే పైకి లేచాడు. ఆకస్మాత్తుగా జరిగిన ఘటనకు తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. వెంటనే పిల్లాడి కాళ్లు పట్టుకుని కిందికి గుంజారు. పిల్లాడిని పక్కకు తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Giraffe tries to kidnap a boy at the zoo pic.twitter.com/5Jr0GLMmks
— Crazy Clips (@crazyclipsonly) February 1, 2024
ఇవి కూడా చదవండి
Bharata-Ratna”ఎల్ కే అద్వానికి భారత రత్న… మోదీ ఏమన్నారంటే
Punam pandey నేను చనిపోలేదు.. ఇదంతా నాటకమంతే.. క్యాన్సర్‌పై అవగాహనకోసమే..
Brs Party” బీఆర్ ఎస్ కు మరో షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..