ఆహారం పెట్టిన పిల్ల‌వాడు.. బుడ్డోడిని పైకి లేపిన జీరాఫి.. వీడియో వైర‌ల్

జంతువుల‌కు ఆహారం పెట్ట‌డ‌మ‌న్నా.. వాటితో ఆడుకోవ‌డమ‌న్నా చిన్న పిల్ల‌ల‌కు భ‌లే స‌ర‌దా. అందుకే చిన్నపిల్ల‌లు ఎక్కువ‌గా జంతువులను ఇష్ట‌పడుతుంటారు. అయితే సోష‌ల్ మీడియాలో ఓ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. జీరాఫికి ఆహారం పెట్టేందుకు ప్ర‌య‌త్నించిన పిల్లాడిని ఆమాంతం పైకి లేప‌డంతో ఆ అబ్బాయి త‌ల్లిదండ్రులు ఆశ్చ‌ర్యానికి గురయ్యారు. ఓ బుడ్డోడు త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి జూలోని జంతువుల‌ను చూసేందుకు వెళ్లాడు. ఈ క్ర‌మంలో ఓ జిరాఫీకి ఆహారం పెట్టేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో నోటితో ఆహారాన్ని అందుకున్న ఆ జిరాఫి ఆ ఆకును పైకి తీసుకుంది. కానీ పిల్ల‌వాడు మాత్రం దాన్ని గ‌ట్టిగా ప‌ట్టుకోవ‌డంతో అలాగే పైకి లేచాడు. ఆక‌స్మాత్తుగా జ‌రిగిన ఘ‌ట‌న‌కు త‌ల్లిదండ్రులు షాక్ గుర‌య్యారు. వెంట‌నే పిల్లాడి కాళ్లు ప‌ట్టుకుని కిందికి గుంజారు. పిల్లాడిని ప‌క్క‌కు తీసుకెళ్లారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

 

ఇవి కూడా చ‌దవండి

Bharata-Ratna”ఎల్ కే అద్వానికి భార‌త ర‌త్న… మోదీ ఏమ‌న్నారంటే

Punam pandey నేను చ‌నిపోలేదు.. ఇదంతా నాట‌క‌మంతే.. క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న‌కోస‌మే..

Brs Party” బీఆర్ ఎస్ కు మ‌రో షాక్‌.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..

holiday” ఫిబ్రవరి 8న సాధార‌ణ సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *