Congress MP second list” లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సెకెండ్ జాబితాను కాంగ్రెస్ మంగళవారం ప్రకటించింది. మొత్తం 43 మంది అభ్యర్థుల పేర్లతో (Congress MP second list) సెకెండ్ జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో (Congress MP second list) సెకెండ్ జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో జనరల్ కేటగిరీలో 10మంది, 13 మంది ఓబీసీలు, 10మంది షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు, 9 మంది షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులు, ఒక ముస్లిం అభ్యర్థులు ఉన్నారు. రాజస్థాన్ లోని జాలోర్ నుంచి రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట కుమారుడు వైభవ్, అసోం లోని జోర్హాట్ నుంచి గౌరవ్ గగోరు పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మధ్యప్రదేశ్ లోని చింద్వారా నుంచి మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ పోటీ చేయనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల రెండో జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో 43 మంది పేర్లను ప్రకటించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌తో పాటు వివిధ రాష్టాల్లో 43 మంది అభ్యర్థులను ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ 39 మంది అభ్యర్థులతో (Congress MP second list) మొదటి జాబితాను విడుదల చేసింది. కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయనున్న రాహుల్ గాంధీతో సహా రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ 39 మంది అభ్యర్థులను ముందుగా ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాజ్‌నంద్‌గావ్ నుంచి పోటీ చేసేందుకు నామినేట్ అయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళలోని అలప్పుజ నుంచి పోటీ చేయనుండగా, శశి థరూర్ తిరువనంతపురం నుంచి తిరిగి నామినేట్ అయ్యారు.
ఇవి కూడా చదవండి
Malkajigiri MP Candidate” మల్కాజిగిరి ఎంపీ స్థానానికి బిఆర్‌ఎస్ అభ్యర్థి ప్రకటన
Kcr Meeting” కరెంట్ పోకుండా కరెంట్ ఇచ్చిన ఘనత మాదే కేసీఆర్
Ts Rtc Md” మీ మెదడుకు పదునుపెట్టి సరైన సమాధానం చెప్పుకోండి.. చూద్దాం!? ఆర్టీసీ ఎండీ ట్వీట్