Funny Video” సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తాయి. మరికొన్ని వీడియోలు కడుపు పగిలేలా నవ్విస్తాయి.. ఈ వీడియో కూడా అటువంటిదే.. ఇద్దరు మహిళలు స్కూటిపై గేటు దాటి ఇంట్లోకి వస్తారు. పార్కింగ్ చేయడం కోసం స్కూటిపై రౌండ్ వేయబోతారు. అది జర్రున జారి పక్కకు పడుతారు. వాళ్లు లేచే లోపే ఇంట్లో ఉన్న వ్యక్తి ఆదరాబాదరా వారిని లేపేందుకు పరుగెత్తుకొస్తాడు. వారి దగ్గరకు రాగానే అతను జారి వారిపైనే పడుతాడు. ఈ వీడియోను చూస్తే నవ్వు మాత్రం ఆగదు. ఈ వీడియోను వై.ఎస్ కాంత్ అనే వారు ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి పార్కింగ్ ఇలా చేయాలని తెలియక, ఇన్నాళ్లూ మామూలుగా చేసేసా అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
పార్కింగ్ ఇలా చేయాలని తెలియక,
ఇన్నాళ్లూ మామూలుగా చేసేసా ♂️
pic.twitter.com/NvL8UK9qPZ— వై.ఎస్.కాంత్ (@yskanth) July 28, 2024