Cloudburst” హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కుంభ వృష్టి కురుస్తోంది. సిమ్లా జిల్లాలోని రాంపూర్ లో గల సమేజ్ ఖాడ్ గ్రామాన్ని తీవ్ర విషాదం చుట్టు ముట్టింది. ఆ ఊరులో ఒక్కటే ఇల్లు మిగిలింది. మిగితా ఊర్లోని ఇండ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఈ వివరాలను ఆ దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన అనితాదేవీ అనే మహిళ రోదిస్తూ తెలిపింది. ఈ మేరకు ఆమె ఓ నేషనల్ విూడియాతో మాట్లాడింది. తన భయాంకర అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. ఆ ప్రళయం సంభవించినప్పుడు వారంతా నిద్రలో ఉన్నామని చెప్పుకొచ్చింది.
Pune Crime news” అయ్యో తల్లీ… గేటు మీదపడి చిన్నారి మృతి.. సీసీ వీడియో
ఒక్కసారిగా పెద్దశబ్దం వినిపడింది.. మా ఇల్లు దద్దరిల్లిందని అనితాదేవీ చెప్పుకొచ్చారు. ఏం జరిగిందో తెలుసుకుందామని మేమంతా బయటకువచ్చి చూస్తే అంతా నీరే ఉంది. గ్రామమంతా కొట్టుకు పోయిందని తెలిపింది. ఆమె 14 మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది. గ్రామంలోని 60కి పైగా ఇండ్లు కొట్టుకుపోయాయి. మొత్తంగా ఇప్పటివరకు 8 డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. 50 మందికి పైగా గ్రామస్థులు గల్లంతయ్యారు. డిస్టిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఉన్నతాధికారి డీసీ రాణా మాట్లాడుతూ.. గ్రామమంతా ధ్వంసమైందని పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Khammam News” అతివేగం… ఆగిఉన్న లారీని ఢీ కొట్టి ముగ్గురు మృతి.. వీడియో
Rescue Viral Video” గ్రేట్ గ్రేట్.. రెస్క్యూ అంటే ఇదీ..? ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Runa mafi” రైతులకు గుడ్ న్యూస్ .. రెండో విడత రుణమాఫీకి రంగం సిద్ధం