Digital Card” రేష‌న్ బియ్యం స‌హా అన్నింటికీ ఒకటే డిజిట‌ల్ కార్డు..

Digital Card

Digital Card” ప్ర‌భుత్వం అమ‌లు చేసే సంక్షేమ ప‌థ‌కాల‌న్నింటికీ ఒకటే డిజిట‌ల్ కార్డును జారీ చేసేలా తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ ఆలోచ‌న చేస్తున్న‌ది. ఈ మేర‌కు డిజిటల్‌ కార్డులపై మినిస్ట‌ర్స్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తో కలిసి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సోమ‌వారం సీఎం సవిూక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ డిజిటల్‌ కార్డుల జారీ చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.ఈ డిజిటల్‌ కార్డుల జారీ చేసేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక మున్సిపాలిటీ, ఓ గ్రామంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ కార్డుతోనే రేషన్‌, ఆరోగ్య సేవలతోపాటు ప్ర‌భుత్వ సంక్షేమ పథకాలన్నీ ఒక‌టే కార్డుతో అమలు చేసేలా ప్ర‌ణాళిక ర‌చిస్తోంది. ఈ డిజిటల్‌ కార్డులో ఫ్యామిలీ మెంబ‌ర్లంద‌రికీ హెల్త్‌ ప్రొఫైల్‌ పొందుపరిచి, దాని నుంచి అన్ని హెల్థ్ సేవలు అందించాలని చెప్పారు. అర్హ‌త ఉన్నోళ్ల‌కు కుటుంబ డిజిటల్‌ కార్డులు అందేట‌ట్టు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందు కోసం జిల్లాల వారీగా ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

 

Ayushman Bharat” వారికి ఉచిత వైద్యం.. కేంద్రం స్కీమ్ ఇదే.. 5 ల‌క్ష‌ల మందికి లాభం

Washing Machine” ప్యాన‌సోనిక్ వాషింగ్ మెషిన్ రూ. 12,490కే

Viral Video” ఇదెక్కడి పిచ్చి. కనీస సోయి లేదు వీడియో వైర‌ల్

5G Phone”16 వేలల్లో 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా..? POCO X6.. 5G

Jamili Elections” ఒకే దేశం.. ఒకే ఎన్నికకు కేంద్ర కేబినేట్ ఆమోదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *