Group 2 Hall Tickets”గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 23వ తారీఖున గ్రూప్ జరగనుంది. ఇందుకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఆధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం విడుదల చేసింది. ఇందుకోసం ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. 23తారీఖు ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్ వన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు పేపర్ టూ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఎగ్జామ్స్ సెంటర్స్ కి కేవలం హాల్ టికెట్ మాత్రమే తీసుకురావాలని పేర్కొన్నది. ఇతర వస్తువులను ఏవిూ తీసుకురావొద్దని ఏపీపీఎస్సీ సూచించింది.
కాగా గత ప్రభుత్వ హాయంలో గతేడాది డిసెంబర్ 7న గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను విడుదల చేయగా.. అనంతరం రెండు నెలల వ్యవధిలోనే అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు 4,83,535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ఏప్రిల్ 10న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 92, 250 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇప్పటి వరకూ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేదీని రెండు సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23వ తేదీన మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. కాగా మొత్తం 905 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి
Viral Video” నీళ్లలో ఉన్నాననుకుంటే.. తొక్కిచంపిన ఏనుగు..
Amazon Offer” ది పర్ఫెక్ట్ టీవీ డేట్.. టీవీలపై ఆమెజాన్ ఆఫర్ల ధమాకా
Bank jobs” సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్స్.. 1000 ఖాళీలు
OnePlus Nord CE4″ వనప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ … వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్‌తో..
Dell Laptop” డెల్ ల్యాప్‌టాప్.. విండోస్ 11 హోం.. 32,990లకే…
BHEL Recruitment 2025″ బీహెచ్ ఈఎల్ 400 పోస్టులు.. చివరి తేదీ: 28-02-2025
Realme Phones” రియల్ మీ వాలెంటైన్స్ డే.. అదిరిపోయే ఆఫర్లతో రియల్ మీ ఫోన్లు..
BHEL Recruitment 2025″ బీహెచ్ ఈఎల్ 400 పోస్టులు.. చివరి తేదీ: 28-02-2025
Smart TV” 43 ఇంచుల టీవీ 24 వేలల్లో..
Smart TV” 43 ఇంచుల టీవీ 24 వేలల్లో..
