Intermediate Hall Tickets” మరికొన్ని రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షల ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో హాల్ టికెట్లను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. మార్చి నెల 1, 3వ తారీఖుల నుంచి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను వాట్సప్ గవర్నెన్స్‌లో అందించేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి సైతం వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి పేర్కొన్నారు. ఇటీవల ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధంచిన హాల్ టికెట్లను సైతం వాట్సప్ నుంచే డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కల్పించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి సుమారు 10 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ ఫీజులు చెల్లించ లేదంటూ విద్యార్థులకు ప్రైవేటు కాలేజీలు హాల్ టికెట్లు జారీ చేయకుండా.. ఆపేయడం వంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. వాట్సప్ నంబరు 9552300009 ద్వారా ఇంటర్ హాల్‌టికెట్లను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పైను ఉన్న నెంబర్‌ను మీ మొబైల్లో ఉన్న నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ తరువాత ఎడ్యుకేషనల్ సర్వీస్‌పై క్లిక్ చేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ను సెలెక్ట్ చేసుకుని సంబంధిత వివరాలు ఎంటర్ చేసి మీ హాల్ టిక్కెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మరోవైపు 10వ తరగతి విద్యార్థులు సైతం వాట్సప్‌లోనే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధంగా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఫస్ట్ ఇయర్ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఇవి మార్చి 19వ తేదీతో ముగియనున్నాయి. అలాగే ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
Harihara Veeramallu” సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడుస మీరు ప్రోమో వినండి..
Amazon Offer” వనప్లస్ 12ఆర్ 8 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ.. చూడండి వివరాలు..
Bank Jobs” బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4000 పోస్టుల భర్తీ.. ఏదైనా డిగ్రీతో…
realme P3 Pro 5G” రియల్ మీ పీ 3 ప్రో 5 జీ ఫ్లిప్‌కార్ట్‌లో 18 శాతం తగ్గింపుతో..
