TS Government Jobs” అంగన్వాడీల్లో టీచ‌ర్లు, హెల్ప‌ర్ల కొలువుల జాత‌ర.. ఇంట‌ర్ అర్హ‌త‌..

TS Government Jobs

TS Government Jobs”  రాష్ట్రంలోని మ‌హిళ నిరుద్యోగులకు తెలంగాణ‌ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. త్వ‌ర‌లోనే 14,236 పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై శ‌నివారం మ‌హిళా సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క సంత‌కం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 35,700 అంగ‌న్ వాడీ సెంట‌ర్లు ఉన్నాయి. ఒక్కో సెంట‌ర్లో ఒక‌ టీచ‌ర్, ఒక హెల్ప‌ర్ ఉంటారు. ప్ర‌స్తుతం 14,236 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిలో 6399 టీచ‌ర్లు, 7837 హెల్ప‌ర్ల పోస్టులు ఉన్నాయి. వీటికి సంబందించిన నోటిఫికేష‌న్‌ విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ది. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ ఉంది. కోడ్ ముగియ‌గానే భ‌ర్తీకి సంబంధించిన ప్ర‌క్రియ ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం. 35,700 అంగ‌న్ వాడీ సెంట‌ర్ల‌తో పాటు 149 ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్స్‌) ప్రాజెక్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ సెంట‌ర్ లు ఉన్నాయి. ఒక్కొక్క సెంట‌ర్‌లో టీచ‌ర్‌తోపాటు, హెల్పర్ తప్పనిసరి గా ఉండాలి.

అయితే గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో కొంద‌రు రాజీనామా చేశారు. మ‌రి కొంద‌రికి సూపర్ వైజర్లుగా పదోన్నతితో వెళ్లారు. 65 ఏండ్ల‌ వయసు నిండ‌డంతో ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 65 ఏండ్ల వయసు దాటిన వారు కూడా ఉన్నారు. వారు కూడా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగ విరమణ చేయనున్నారు.

ఇంటర్మీడియట్ అర్హత.. 

టీచ‌ర్ పోస్టుల‌కు ఇంత‌కుముందు పదో తరగతి పాసై ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌ మార్గదర్శ కాలను జారీ చేసింది. వీటి ప్ర‌కారం.. టీచర్‌, హెల్పర్లకు కనీసం ఇంటర్మీడియ్ ఉత్తీర్ణ‌త‌గా నిర్ణ‌యించారు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు.

వ‌య‌స్సు అర్హ‌త 

అంగన్వాడీ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుంచి 35 ఏళ్లుగా కేంద్రం పేర్కొంది.
ఈ నేప‌థ్యంలో కేంద్ర మార్గదర్శ కాల మేరకు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీలో 50 శాతం.. హెల్ప‌ర్ల‌కు కేటాయించాలి.

 

 

మ‌రిన్ని ఉద్యోగ వార్త‌ల కోసం ఈ లింక్ నుక్లిక్ చేయండి..https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

 

Intermediate Hall Tickets” వాట్స‌ప్‌లోనే ఇంటర్‌ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ .. ఇంటర్‌ బోర్డు వెల్లడి

Flipkart Offer” 50 ఇంచుల టీవీ కేవ‌లం రూ. 26,999ల‌కే.. ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్ తో మ‌రింత త‌క్క‌వ‌లోనే..

Bank Jobs” 518 ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు.. ఎనీ డిగ్రీ, బ్యాంకు ఉద్యోగాలు..

Bank Jobs”యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2691 పోస్టులు… ఏదైనా డిగ్రీతో

GAIL Recruitment” గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో (GAIL) 73 పోస్టుల రిక్రూట్‌మెంట్ పోస్టు పేరు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

BECIL Recruitment 2025″ బీఈసీఐఎల్ లో జూనియర్ ఇంజనీర్ & ఇతర నియామకాలు 407 పోస్టులు.. టెన్త్, ఇంట‌ర్ అర్హ‌త‌తో కూడా

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *