Thursday , 1 May 2025

22.03.2025 క‌రీంన‌గ‌ర్ జిల్లా వార్త‌లు

Karimnagar news”  మక్త గ్రామంలో విషాదం.. బైక్ ను ఢీకొన్న లారీ… తండ్రి కొడుకు అక్కడికక్కడే మృతి… మరో వ్యక్తికి తీవ్ర గాయాలు..

శంకరపట్నం:డిసీ ప్రతినిధి
రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలం మక్త గ్రామానికి చెందిన ఫేక్ అజీమ్ అతని కుమారుడు అబ్దుల్ రెహమాన్ ద్విచక్ర వాహనంపై కేశవపట్నం నుండి స్వగ్రామం మక్త వెళ్తుండగా అతివేగంగా ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో తండ్రి అజీమ్, కొడుకు అబ్దుల్ రెహమాన్ అక్కడికక్కడే మృతిచెందారు. మాందాడి శ్రీనివాసరెడ్డి అనే మ‌రో వ్య‌క్తి కి తీవ్ర గాయాల‌య్యాయి. 108 సిబ్బంది వాహనం ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ ఎం గోపికృష్ణ ఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించి హుజురాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తండ్రీ కొడుకుల మృతితో కుటుంబ సభ్యుల రోదనలతో, మక్త గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి

అంగన్వాడి కేంద్రాల ద్వారా పోషకాహారం..
వంకాయ గూడెం లో గ్రామసభ…
అంగన్వాడి సూపర్వైజర్ అరుణ…
శంకరపట్నం డిసి ప్రతినిధి
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం పోషకాహార అందిస్తుందని అంగన్వాడి సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఐసిడిఎస్ అంగన్వాడి సూపర్వైజర్ అరుణ సూచించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని వంకాయ గూడెం గ్రామంలో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఫ్రైడే గ్రామసభ నిర్వహించారు. పోషకాహారం ఆరోగ్య రక్షణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత జెండర్ స్పెషలిస్ట్ శైలజ, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్ ఆశా కార్యకర్తలు, మహిళలు, చంటి పిల్లల తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో భారీ వర్షం
ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌లు చోట్ల భారీ వ‌ర్షం ప‌డింది. పెద్దపల్లి లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం పడింది. ఉరుములతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. రెండు గంటల వరకు ఎడ తెరిపి లేకుండా కురిసింది. వర్షానికి మక్క, వరి పొలాలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డాయి.

రేపు, ఎల్లుండి వడగళ్ల వాన గండం..!!_*

రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలతోపాటు ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని.. రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఆ తర్వాత మళ్లీ పెరిగేందుకు అవకాశం ముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని.. రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఆ తర్వాత మళ్లీ పెరిగేందుకు అవకాశం ముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

 

కరీంనగర్ విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్
నిరంతర సాధన తో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో అంబేద్కర్ స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్, ప్రాంతీయ క్రీడా పాఠశాలలోని స్విమ్మింగ్ పూల్ ఆధునికరించారు. క్రీడా పాఠశాలలో యోగా కేంద్రం నిర్మించారు. జిమ్నాస్టిక్స్, యోగ, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చారు. క్రీడాకారులకు వసతులు, సౌకర్యాలు కల్పించారు.
ఆధునికరించిన తర్వాత స్విమ్మింగ్ పూల్, క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఇక్కడ సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్విమ్మింగ్ పూల్ వద్ద ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటాలని సూచించారు. స్పోర్ట్స్ స్కూల్ వద్ద విద్యార్థుల కోసం ఎటువంటి సౌకర్యాలు అవసరం ఉన్నా సమకూర్చాలని ఆదేశించారు.
యోగ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను ప్రాంతీయ క్రీడా పాఠశాలలో సమకూర్చామని, విద్యార్థులు ఈ సదుపాయాలను వినియోగించుకొని క్రీడారంగంలో మరింత రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రాంతీయ పాఠశాల విద్యార్థుల అథ్లెటిక్స్, యోగ, జూడో, జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

 

కొత్త ఓటరు నమోదు చేసుకోవాలి
కరీంనగర్
18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు కొత్త ఓటర్ నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్లు లక్ష్మి కిరణ్ ప్రపుల్ దేశాయి తెలిపారు.అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటర్ నమోదు కార్యక్రమం గురించి నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశాన్ని అదనపు కలెక్టర్లు లక్ష్మి కిరణ్, ప్రఫుల్ దేశాయి లు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, 18 సంవత్సరాలు నిండిన వారు తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కొత్తగా ఓటరు నమోదు చేసుకొనువారు, తప్పుల సవరణ చేసుకొనేవారు, డబుల్ ఓటర్ నమోదు సవరణ చేసుకొనేవారు, స్థల మార్పిడి చేసుకొను వారు, చనిపోయిన వారి ఓటు తొలగింపుకు సంబంధించి ఫామ్ -6, ఫామ్ -7, ఫామ్ -8 ఫారాలు ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని సూచించారు. ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్వో వెంకటేశ్వర్లు, కరీంనగర్ ఆర్డిఓ కే.మహేశ్వర్, ఏవో సుధాకర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నిధి సిరాజ్ హుస్సేన్, బిఆర్ ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్ , బిజెపి పార్టీ ప్రతినిధి నాoపల్లి శ్రీనివాస్, సిపిఐ పార్టీ ప్రతినిధి మిల్కూరి వాసుదేవ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కల్యాడపు ఆగయ్య, బి ఎస్ పి పార్టీ ప్రతినిధి సిరిసిల్ల అంజయ్య తదితరులు పాల్గోన్నారు.

 

About Dc Telugu

Check Also

అంత‌రిక్షంలో ప‌లు ప‌రిశోధ‌న‌ల కోసం వెళ్లిన వ్యోమ‌గాముల‌కు ఆహారం అందించేందుకు ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. దీనిపై ఫ్రెంచ్ సైంటిస్టులు దృష్టి సారించారు. …

Viral Video” పోలీస్‌స్టేష‌న్‌కు చిరుత‌పులి…. త‌ర్వాత ఏమైందంటే.. వీడియో

Viral Video” అడవిలో ఉండాల్సిన పులి పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా …

China” పాకిస్తాన్‌కు చైనా మ‌ద్ద‌తు.. చైనాది పాత పాటే..

China”  ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడుల త‌ర్వాత భారత్ పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తాము ఉగ్ర‌దాడి చేయ‌లేదంటూనే యుద్దానికి సిద్ద‌మ‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com