Wednesday , 30 April 2025

Jr Ntr” జపాన్‌లో ఎన్టీఆర్‌ సందడి.. వీడియో

Jr Ntr” జూనియర్‌ ఎన్టీఆర్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 గతేడాది సెప్టెంబర్‌ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడమే కాకుండా దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే సినిమాను జపాన్‌లో విడుదల చేస్తున్నారు మేకర్స్‌. ఎన్టీఆర్‌ గత చిత్రాలకు జపాన్‌లో మంచి క్రేజ్‌ ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ విడుదలైన బాద్‌షాతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించాయి. ఈ నేపథ్యంలోనే దేవర సినిమాను జపాన్‌లో మార్చి 28న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు మేకర్స్‌. ఈ సందర్భంగా జపాన్‌కి వెళ్లిన ఎన్టీఆర్‌ దర్శకుడు కొరటాల శివ.. జపాన్‌ అభిమానులను కలవడంతో పాటు అక్కడి స్థానిక మీడియాలలో దేవర ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నారు. అయితే జపాన్‌ ప్రజల ప్రేమకు ఫిదా అయిన తారక్‌ తాజాగా వారితో ఉన్న ఒక వీడియోను ఎక్స్‌ వేదికగా పంచుకున్నాడు. మీ ప్రేమతో నా మనసు నిండిపోయింది. జపనీస్‌ ప్రేక్షకులు మార్చి 28 నుండి సినిమా హాళ్లలో ”దేవర”ని అనుభవించడానికి నేను వేచి ఉండలేను అంటూ రాసుకోచ్చాడు.

 

 

About Dc Telugu

Check Also

Pakistan” యుద్ద భ‌యం.. క‌వ్వింపు చ‌ర్య‌లు… సైనికుల రాజీనామా..

Pakistan” పాకిస్తాన్ ఎప్పుడు వ‌క్ర‌బుద్దే చూపిస్తుంటుంది. ప‌హ‌గాల్గ‌మ్ దాడి త‌ర్వాత భార‌త్ సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆ దాడితో మాకు సంబంధం …

అంత‌రిక్షంలో ప‌లు ప‌రిశోధ‌న‌ల కోసం వెళ్లిన వ్యోమ‌గాముల‌కు ఆహారం అందించేందుకు ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. దీనిపై ఫ్రెంచ్ సైంటిస్టులు దృష్టి సారించారు. …

Local news” ప్రజా సంక్షేమమే జన సమితి లక్ష్యం…

Local news”  టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది ముక్కెర రాజు … గణేష్ సేవలు అభినందనీయం… శంకరపట్నం: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com