వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఆస్ట్రేలియా సంబురాల్లో మునిగి తేలింది. కానీ సంబురం ఓవరాక్షన్ కావడంతో ఓ క్రికెటర్ పై ఢిల్లీలో కేసు నమోదు అయ్యింది. ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ మార్ష్‌పై కేసు నమోదు అయింది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త పండిట్ కేశవ్.. మిచెల్ మార్ష్ పై పోలీసులకు కంప్లయింట్ చేశాడు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు మార్ష్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్‌పై గెలిచిన ఆస్ట్రేలియా ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆరోసారి ప్రపంచకప్ గెలుచుకున్న ఆసీస్ ప్లేయర్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీపై తన పాదాలను ఉంచిన ఫోటో వైరల్‌గా మారింది. ఒక చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని.. రెండు పాదాలను ప్రపంచకప్ ట్రోఫీపై ఉంచిన ఫొటో తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా భారత ఫ్యాన్స్ మార్ష్ తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే అలీఘర్?కు చెందిన పండిట్ కేశవ్ అనే ఆర్‌టీఐ కార్యకర్త.. మిచెల్ మార్ష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌లో మిచెల్ మార్ష్‌పై పండిట్ కేశవ్ లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. మార్ష్ భారతీయ భావోద్వేగాలను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రపంచకప్‌పై పాదాలు వేసి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని అవమానించడమే కాకుండా.. 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని కూడా కించపరిచారని కేశవ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. మార్ష్ భారత్‌లో ఆడకుండా, అలాగే టీమిండియాపై ఎక్కడా ఆడుకుండా జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. కంప్లైంట్ కాపీని ప్రధాని మోడీ, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కార్యాలయాలకు పంపించారు. కేశవ్ లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు మార్ష్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
రెండు చోట్ల ఎవరెవరు పోటీ చేశారు… ఎవరు గెలిచారు..