చెన్నై జట్టుకు భారీ షాక్‌..

ఐపీఎల్‌ 2024 కు ఇప్పటి నుంచి సన్నాహాలు మొదలు పెట్టారు. ప్లేయ‌ర్ల ట్రేడింగ్‌ ప్రక్రియ కూడా సాగుతోంది. రాబోయే డిసెంబర్ నెల ఫ‌స్ట్ వీక్‌లో మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. చెన్నై సూపర్‌ కింగ్స్ ఓవ‌ర్ ఆల్ ఐపీఎల్లో స‌క్సెస్‌ఫుల్ జ‌ట్టు గా పేరొందింది. అయితే ఈ జ‌ట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఈ జ‌ట్టులోని జట్టు స్టార్ క్రికెట‌ర్ ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్‌ తదుపరి ఎడిషన్‌ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. కాలి చీలమండ గాయం కారణంగా స్టోక్‌ గత ఐపీఎల్ లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అనంత‌రం స్టోక్స్ చైన్నై జట్టు తరపున ఇంకో వేరొక మ్యాచ్ ఆడ‌లేదు. పనిఒత్తిడి, నిర్వహణ కారణంగా తదుపరి ఐపీఎల్‌లో ఆడకూడదని స్టోక్స్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పుడు వేలానికి ముందు స్టోక్స్‌ విడుదల చేయబడుతుందో లేదో వేచి చూడాలి. 32 ఏండ్ల స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్‌ 2024 నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓ పత్రికా ప్రకటన ద్వారా అభిమానులకు తెలియజేసింది. బెన్‌ స్టోక్స్‌ తన పనిభారాన్ని అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు ముందు భారత్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ కూడా 2024 జూన్‌లో జరగనుంది. దీంతో స్టోక్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న బెన్‌ స్టోక్స్‌కు సర్జరీ జరగనుందని కూడా వచ్చాయి. ఇటీవలే ఇంగ్లండ్‌ తరపున వన్డే ప్రపంచకప్‌ ఆడిన స్టోక్స్‌ ప్రత్యేక ప్రదర్శన ఏమీ ఇవ్వలేదు. భారత్‌తో జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌కు ఫిట్‌గా ఉండేందుకు స్టోక్స్‌ ఇప్పుడు మోకాలి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఐపీఎల్‌కు వచ్చిన బెన్‌ స్టోక్స్‌ను గత వేలంలో చెన్నై ఫ్రాంచైజీ రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, స్టోక్స్‌ తనకు వచ్చిన డబ్బుకు న్యాయం చేయలేకపోయాడు. దీంతో వచ్చే నెలలో యూఏఈలో జరిగే షార్ట్‌ వేలానికి ముందు స్టోక్స్‌ను జట్టు నుంచి తప్పించేస్తారని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు స్టోక్స్‌ స్వయంగా ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు.

సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్‌.. రేప‌టి నుంచి టీ ట్వంటీ షూరు.. ఎక్కెడెక్క‌డ మ్యాచ్‌లంటే

బౌల‌ర్ల‌కు కొత్త రూల్.. లేట్ చేస్తే జ‌రిమానా.. అలా చేయించుకుంటే అన‌ర్హులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *