Thursday , 5 December 2024
Ganga River Crime news

Ganga River Crime news” రీల్స్ మోజులో.. బిడ్డ గంగాన‌దిలో కొట్టుకుపోతున్న ప‌ట్టించుకోలే… వీడియో

Ganga River Crime news” సోష‌ల్ మీడియా పిచ్చి ప్రాణాల‌ను తీస్తోంది. గంగాన‌ది స్నానానికి వెళ్లిన ఓ వివాహిత రీల్స్ మోజులో ప‌డి త‌న క‌న్న బిడ్డ‌ గంగా న‌దిలో మునిగిపోతున్న ప‌ట్టించుకోలేదు. ఫ‌లితంగా నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘాజీపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. వారణాసిలోని చౌబేపూర్ ప్రాంతంలోని ఉమర్హా గ్రామానికి చెందిన సందీప్ పాండ్య భార్య అంకిత పాండే త‌న కుమార్తె తాన్య (4)తో క‌లిసి త‌న తల్లి గారి ఊరైనా సైద్‌పూర్ ప్రాంతంలోని బౌర్వాన్ గ్రామానికి తన ఛత్ పూజ జరుపుకోవడానికి వెళ్లింది. ఈ క్ర‌మంలో గంగాస్నానం చేసేందుకు తాన్య తన తల్లి, అమ్మమ్మ, ఆమె అత్త స్మృతితో సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవ స్నానానికి సైద్ పూర్‌లోని ప‌క్కాఘాట్ వ‌ద్ద‌కు చేరింది. ఈ క్ర‌మంలో అంద‌రూ క‌లిసి స్నానం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కుటుంబ స‌భ్యులు న‌దిలో స్నానం చేస్తుండ‌గా తాన్య త‌ల్లి ఇన్‌స్టా గ్రాం రీల్ చేస్తున్న‌ది. అదే స‌మ‌యంలో తాన్య నీళ్లో మునిగిపోతున్న విష‌యాన్ని ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు. చాలా సేప‌టి త‌ర్వాత తాన్య లేద‌ని గ‌మ‌నించారు. తాన్య క‌నిపించ‌క పోవ‌డంతో స్థానికుల‌ను సంప్ర‌దించారు. రికార్డు చేసిన వీడియో చూడ‌గా న‌దిలో మునిగిపోతున్నట్టు క‌న్పించింది .దీంతో వెంట‌నే డైవ‌ర్ల‌ను, స్థానిక పోలీసుల‌కు స‌మాచారమిచ్చారు. వారు వ‌చ్చి వెత‌క‌గా 50 మీట‌ర్ల దూరంలో తాన్య మృత‌దేహం క‌న్పించింది.

 

 

మ‌రిన్ని క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌ద‌వండి

Bangalore Konakunte Crime News” ప‌టాకులు పేలుతున్న పెట్ట‌పై కూర్చోవాలి.. స‌వాల్ స్వీక‌రించి.. తుదిశ్వాస విడిచాడు.. సీసీ వీడియో

Cycle Viral Video” న‌రులెవ‌రూ న‌డ‌ప‌న‌ది డ‌బుల్ డెక్క‌ర్ సైకిల్.. వీడియో వైర‌ల్ సోష‌ల్ మీడియా వ‌చ్చాకా ఎవ‌రి టాలెంట్ ఏందో

Water Bottle” 18 రూపాయ‌ల‌కే… స్టెయిన్‌లెస్-స్టీల్ వాటర్ బాటిల్‌

హైద‌రాబాద్‌లో నాగ‌చైత‌న్య పెళ్లి 05.11.2024 D.C Telugu cinema

2027లో ప్ర‌భాస్ సినిమా ఇదే 04.11.2024 D.C Telugau Cinema

All Out Ultra Liquid” ఆల్ అవుట్ అల్ట్రా లిక్విడ్ వేపరైజర్, 6 రీఫిల్స్.. కేవ‌లం 365 రూపాయ‌ల‌కే..

 

About Dc Telugu

Check Also

05.12.2024 D.C Telugu Cinema

05.12.2024 D.C Telugu Morning

04.12.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com