వేర్వేరు ప్రమాదాల్లో ఓ వాహనం తగులబడగా, ఓ ఆర్టీసి బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. హనుమకొండ జిల్లా కమలాపురంలో జాతీయ రహదారిపై టాటాఎస్ వాహనంలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులతో వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షణాల వ్యవధిలో టాటాఎస్ వాహనం నడిరోడ్డుపైనే దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. మరో ఘటనలో వరంగల్ రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దామెర మండలం ఊరుగొండ గ్రామం సవిూపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 70మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం హనుమకొండ నుంచి ఏటూరునాగారం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మీ అభిమానానికి వెయ్యి చేతులెత్తి మొక్కతున్నా ః కేసీఆర్