ఆగ్రా: సినిమా స్టోరీని తలపించేలా ఒక భార్య తన భర్తను అత్యంత దారుణంగా హ*త్య చేసి, ఆపై గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే శవాన్ని పూడ్చిపెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో వెలుగుచూసింది. లౌక్యంగా నాటకాలాడి తప్పించుకోవాలని చూసిన నిందితురాలిని మృతుడి అన్నయ్య చాకచక్యంగా పట్టుకున్నారు.
అసలేం జరిగింది?
ఆగ్రాకు చెందిన సురేంద్ర, రూబీ దంపతులకు 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, మే 18వ తేదీన రూబీ తన భర్తను వదిలించుకోవాలని ఒక క్రూరమైన ప్లాన్ వేసింది. నిద్రమాత్రలు అలవాటున్న సురేంద్రకు, ఆమె ఆ రాత్రి ఏకంగా 16 నుంచి 20 నిద్రమాత్రలను ఖీర్ (పాయసం) లో కలిపి ఇచ్చింది. అది తిన్న కాసేపటికే సురేంద్ర ప్రా*ణాలు కోల్పోయాడు.
బాత్‌రూమ్‌లోనే అంత్యక్రియలు!
భర్త చనిపోయిన తర్వాత శవాన్ని బయటకు తీసుకెళ్తే దొరికిపోతానని భావించిన రూబీ.. మృత*దేహాన్ని లాక్కుంటూ బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లింది. అక్కడ సుమారు ఆరు ఇంచుల మేర నేలను తవ్వి, అందులో భర్త శ*వాన్ని పడేసింది. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా ఇసుక, కంకర తెప్పించి సిమెంట్ ప్లాస్టరింగ్‌తో ఆ ప్రదేశాన్ని పూర్తిగా మూసివేసింది. విస్మయకరమైన విషయం ఏమిటంటే, భర్త శవాన్ని పూడ్చిన అదే బాత్‌రూమ్‌ను ఆమె రోజువారీ అవసరాలకు వాడుకుంటూ, ఇంట్లోనే ఏమీ ఎరుగనట్లు ఉండిపోయింది.
రోడ్డుపై నాటకాలు.. పోలీసుల చేతులెత్తేయడం
భర్త కనిపించకుండా పోవడంతో చుట్టుపక్కల వారు, బంధువులు ప్రశ్నించినప్పుడల్లా రూబీ ఏడుస్తూ నాటకాలాడింది. ప్రాథమికంగా విచారణ జరిపిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును పక్కన పెట్టేశారు.
అన్నయ్య తెచ్చిన ట్విస్ట్!
పోలీసులు నమ్మినా, సురేంద్ర పెద్దన్నయ్య అనిల్‌కు మాత్రం రూబీ ప్రవర్తనపై మొదటి నుంచీ అనుమానంగానే ఉంది. దీంతో ఆయనే స్వయంగా ఆధారాలు సేకరించడం ప్రారంభించారు. జూన్ 29న భరత్‌పూర్‌లోని తన తల్లి పెన్షన్ బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌ను అనిల్ పరిశీలించారు. సురేంద్ర కనిపించకుండా పోయిన తర్వాత కూడా రూబీ ఆ పెన్షన్ ఖాతా నుండి పేటీఎం ద్వారా నిరంతరం డబ్బులు వాడుతున్నట్లు గుర్తించారు. మొత్తం ₹28,000 పెన్షన్ వస్తుంటే, తల్లికి కేవలం ₹10,000 ఇచ్చి మిగిలిన మొత్తాన్ని రూబీనే నొక్కేస్తోందని అర్థమైంది.
దీనిపై అనిల్ ఆమెను నిలదీశారు. “డబ్బులు ఏం చేస్తున్నావు? నిజం చెబితే నిన్ను కాపాడతాను, నా తమ్ముడు ఎక్కడ?” అని గట్టిగా అడిగారు. దీంతో రూబీ తీవ్ర ఒత్తిడికి గురైంది.
“బాత్‌రూమ్‌లో రెండు అడుగుల కింద ఉన్నాడు!”
ఇక తాను దొరికిపోయానని గ్రహించిన రూబీ.. శుక్రవారం ఉదయం అనిల్‌కు ఫోన్ చేసి, “మీ తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు, వచ్చి మాట్లాడండి” అని చెప్పింది. అనిల్ ఇంటికి రాగానే బాత్‌రూమ్ వైపు చూపించింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో అనిల్ నిలదీయగా.. “రెండు అడుగుల కింద ఉన్నాడు” అంటూ అసలు నిజాన్ని ఒప్పేసుకుంది. వెంటనే అనిల్ పోలీసులకు సమాచారం అందించారు.
అనాథలైన పిల్లలు
ఈ ఘోర కలియుగం వల్ల ఆ కుటుంబంలోని ఇద్దరు కుమార్తెలు (13 ఏళ్ల ప్రాచి, 9 ఏళ్ల సిద్ధి) అనాథలుగా మారారు. తండ్రి మరణించగా, తల్లి జైలు పాలవడంతో ఆ పిల్లలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు తమ నానమ్మ, పెద్దనాన్న సంరక్షణలో ఉంటున్నారు. భర్తను చం*పిన నిందితురాలు రూబీని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
also read
అగ్నిపర్వతం బద్దలైంది.. లావా కాకుండా బంగారాన్ని వెదజల్లుతోంది..
వాట్సాప్ యూజర్లకు షాక్: ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌కు బ్రేక్.. మెటాకు కేంద్రం నోటీసులు!
ఏకబిగిన 36 గంటల ఆపరేషన్.. ఒకేసారి 5 అవయవాల మార్పిడి… ఉస్మానియా వైద్యుల అరుదైన రికార్డు
