కరీంనగర్, ఫిబ్రవరి 18 (DCTelugu):
తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ ద్వారా మార్చి 21 నుండి మే 21 వరకు నాలుగు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్లు టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి.వి. వెంకటేష్ తెలిపారు. బుధవారం కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన యాత్ర వివరాలను వెల్లడించారు.
1. దివ్య దక్షిణ యాత్ర (జ్యోతిర్లింగ దర్శనం)
దక్షిణ భారత పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారి కోసం ఈ ప్యాకేజీ.
-
తేదీలు: మార్చి 21 నుండి 28 వరకు.
-
కవర్ అయ్యే ప్రాంతాలు: తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు.
-
ధరలు: స్లీపర్: ₹14,700 | 3AC: ₹22,300 | 2AC: ₹28,700.
-
బోర్డింగ్ పాయింట్లు: సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట మీదుగా..
2. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర
-
తేదీలు: ఏప్రిల్ 14 నుండి 24 వరకు.
-
ప్రాంతాలు: ఉజ్జయిని (మహాకాళేశ్వర్), ఓంకారేశ్వర్, ద్వారక, సోమనాథ్, పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్).
-
ధరలు: స్లీపర్: ₹17,600 | 3AC: ₹26,700 | 2AC: ₹34,600.
-
రూట్: సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్ మీదుగా..
3. అయోధ్య – కాశీ – బైద్యనాథ్ ధామ్ యాత్ర
-
తేదీలు: ఏప్రిల్ 28 నుండి మే 5 వరకు.
-
ప్రాంతాలు: పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్.
-
ధరలు: స్లీపర్: ₹16,700 | 3AC: ₹26,100 | 2AC: ₹34,100.
-
రూట్: సికింద్రాబాద్, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం మీదుగా..
4. హరిద్వార్ – మాతా వైష్ణోదేవి – రిషికేశ్ యాత్ర
-
తేదీలు: మే 12 నుండి 21 వరకు.
-
ప్రాంతాలు: మధుర, బృందావనం, వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేశ్.
-
ధరలు: స్లీపర్: ₹16,500 | 3AC: ₹25,700 | 2AC: ₹33,400.
-
రూట్: సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, నాగ్‌పూర్ మీదుగా..
ప్యాకేజీలో లభించే సౌకర్యాలు:
-
రైలు ప్రయాణం, బస్సు వసతి, హోటల్ వసతి.
-
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం.
-
ట్రావెల్ ఇన్సూరెన్స్ మరియు టూర్ ఎస్కార్ట్ సేవలు.
-
ప్రతి కోచ్‌కి సెక్యూరిటీ గార్డ్ మరియు సీసీ కెమెరాల భద్రత.
హైదరాబాద్ నుండి విమాన ప్యాకేజీలు (Air Packages):
రైలు ప్రయాణమే కాకుండా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్యాకేజీలను కూడా రైల్వే శాఖ ప్రకటించింది.
| ప్రాంతం | రోజులు | ధర (ఒక్కొక్కరికి) |
| నేపాల్ (అంతర్జాతీయ) | 7 రోజులు | ₹55,700 |
| శ్రీలంక (అంతర్జాతీయ) | 6 రోజులు | ₹62,750 |
| అండమాన్ నికోబార్ | 6 రోజులు | ₹46,950 |
| కాశ్మీర్ | 6 రోజులు | ₹42,590 |
| హిమాచల్ & పంజాబ్ | 7 రోజులు | ₹45,850 |
టికెట్ బుకింగ్ కోసం..
ఆసక్తి గల వారు ఈ క్రింది నంబర్లలో సంప్రదించవచ్చు: 📞 9701360701, 9281030727, 9281030759 లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.
