bhargavastra” భారత్‌ ‘భార్గవాస్త్ర’తో డ్రోన్లకు చెక్ పెట్టింది! | రక్షణ రంగంలో కొత్త విజయానికి భారత్ అరంగేట్రం

bhargavastra”  పోటీ పరీక్షల దృష్టిలో వార్తకు ప్రాధాన్యత:

రక్షణ రంగానికి సంబంధించి తాజా ప్రగతి, DRDO, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, మరియు స్వదేశీ టెక్నాలజీ విషయాలు చాలా పరీక్షల్లో (UPSC, TSPSC, APPSC, SSC, SI, Constable) రెగ్యులర్‌గా వస్తుంటాయి. కాబట్టి అంశాన్ని మీ నోట్స్‌లో తప్పనిసరిగా జత చేయండి.

️ ‘భార్గవాస్త్ర’ అంటే ఏంటి?

భార్గవాస్త్ర అనేది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఒక కౌంటర్ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని  సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌  Solar Defence and Aerospace Limited (SDAL) అభివృద్ధి చేసింది. ఇది చిన్న డ్రోన్ల దండును గుర్తించి, కొన్ని క్షణాల్లోనే వినాశనం చేసే అత్యాధునిక సాంకేతికతతో కూడిన వ్యవస్థ.


భార్గవాస్త్ర పరీక్ష వివరాలు:

  • స్థలం: గోపాల్‌పూర్, ఒడిశా (Seaward Firing Range)

  • మూడు దశల ట్రయల్స్ విజయవంతం

  • మూడవ దశలో రెండు మైక్రో రాకెట్లు 2 సెకన్లలో ప్రయోగించి డ్రోన్ సమూహాన్ని ఛేదించడం


భార్గవాస్త్ర సామర్థ్యాలు:

లక్షణం వివరాలు
గుర్తింపు పరిధి 2.5 కి.మీ. దూరంలో డ్రోన్లను గుర్తించగలదు
రాడార్ పరిధి 6–10 కి.మీ. వరకు గగనతల ముప్పులను పసిగడుతుంది
రక్షణ స్థాయులు రెండు (Unguided + Guided micro missiles)
మిక్రో క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి
వాతావరణ అనుకూలత సముద్ర మట్టం నుండి 5000 మీటర్ల ఎత్తులోనూ పనిచేస్తుంది
తయారీ తక్కువ ఖర్చుతో, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం ఆధారంగా తయారు

రక్షణ రంగంలో ప్రాధాన్యత

  • డ్రోన్ల ముప్పులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, భార్గవాస్త్ర వంటి టెక్నాలజీ భారత భద్రత వ్యవస్థకు కీలక భూమిక పోషించనుంది.

  • ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే చర్యగా పరిగణించబడుతోంది. 

  • పోటీ పరీక్షల కోసం ముఖ్యమైన పాయింట్లు:

    1. భార్గవాస్త్రను అభివృద్ధి చేసిందిSolar Defence and Aerospace Ltd (SDAL)

    2. ఇది పనిచేసే పరిధి2.5 కి.మీ. (గుర్తింపు), 6-10 కి.మీ. (రాడార్)

    3. పరీక్షలు జరిగిన స్థలంగోపాల్‌పూర్, ఒడిశా

    4. రక్షణ విధానాలుUnguided మరియు Guided మైక్రో క్షిపణులు

    5. సాంకేతికతపూర్తిగా స్వదేశీ, తక్కువ ఖర్చుతో రూపొందించబడింది  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *