సృష్టిలో తల్లి ప్రేమను మించిన ప్రేమ మరో చోటదొరకదు అంటారు. అప్పడప్పుడప్పు కొన్ని ఘటనలు అందుకు సాక్షాత్కరిస్తాయి. బిడ్డలను కాపాడుకునేందుకు తల్లి ఎంతటి సాహసానికైనా తెగిస్తుందంటారు. అందుకు తన ప్రాణాలైనా అడ్డుపెడుతోంది. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఘటన అందుకు నిలువెత్తు సాక్ష్యం. బీహార్ రాష్ట్రం దానాపూర్ రైల్వే డివిజన్‌లోని బార్హ్ రైల్వే స్టేషన్. ఢిల్లీకి వెళ్లేందుకు ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆ రైల్వే స్టేషన్ శనివారం కు వచ్చింది. కొద్దిసేపటి తరువాత భాగల్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే విక్రమశిలా ఎక్స్‌ప్రెస్ రైల్ ఫ్లాట్ ఫారమ్ మీదకు చేరుకుంది. ఆ ట్రయిన్‌లో ఎక్కేందుకు జనం భారీగా చేరుకున్నారు. ఆ తల్లి కూడా తన ఇద్దరు చిన్నారులను తీసుకుని రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ప్రమాదావశాత్తూ ఇద్దరు పిల్లలు సహా రైలు పట్టాలు, ఫ్లాట్ ఫామ్ మధ్య పడిపోయిది. కానీ ఏమాత్రం భయపడకుండా ఆ తల్లి ఇద్దరు పిల్లలను తన వద్దకు తీసుకుని రైలు తాకకుండా పడుకుంది. ఆమెకు అత్యంత సమీపం నుంచే రైలు వెళ్లింది. పైనుంచి మృత్యువు వెళ్తున్నా కొంచెం కూడ భయపడకుండా అలాగే కదలకుండా ఉండి తన పిల్లలను కాపాడుకుంది. అందరూ ఆమెను అభినందించారు.
मौत के सामने जीती मां की ममता. #Bihar के #Barh रेलवे स्टेशन से वीडियो. भीड़ में मां, दो बच्चों संग पटरी पर गिरी. ट्रेन चलने लगी. 3 जिंदगियों के सामने मौत खड़ी थी. और दूसरी तरफ मां. उधर ट्रेन की रफ्तार थी. तो इधर मां की ममता. 25 सेकेंड बाद मां जीती. मौत हारी. #viralvideo #barh pic.twitter.com/bsDxbD0EFS
— Sunil Maurya (@smaurya_journo) December 24, 2023