నీరు సాధారణంగాచల్లగానే ఉంటుంది. అందునా పారుతున్న నది లేదా వాగుల్లోని నీరు చల్లగా హాయిగా ఉంటుంది. కానీ నిత్యం మరుగుతూ పొగలుగక్కుతున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏండ్ల తరబడి ఇలాగే ఉంది. ఈ నదిని బాయిల్డ్ రివర్ అని పేరు. ఈ రివర్ సౌత్ అమెరికాలోని పెరువియన్ అమెజన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఉన్నది. అమెజాన్ రివర్‌కు ఉపనది అని కూడా అంటారు. మొత్తం వరల్డ్‌లోనే మరుగుతున్న రివర్ ఇదిమాత్రమే. వాస్తవంగా ఈ నదిపేరు షానరు-టింపిష్కా. లా బొంబా నదిగానే ఫేమస్ అయ్యింది. ఈ నది పొడవు అందాద 6.4 కిలోవిూటర్లు. నదిలోని నీరు ఉష్ణోగ్రతలు 212 డిగ్రీల ఫారెన్‌హీట్ (100 డిగ్రీల సెల్సియస్) ఉంటది. ఎందుకు రోజూ ఇలా మరుగుతూ పొగలు గక్కుతూ ఉంటుందనేది అంతుచిక్కని రహస్యం. కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. రాతినేలల్లో బాగా వేడి ఉండడం వల్ల ఈ నది నీరు మరుగుతుందని చెబతున్నారు. ఇంకొంత మంది భూ ఉష్ణోగ్రత వల్ల కూడా ఇలా జరుగుతుందంటారు. భూ ఉష్ణోగ్రత వల్ల అయితే మిగితా నదులు ఎందుకు మరుగుతాలేవని పలువురి ప్రశ్న. ఈ నది చుట్టు ఉన్నవాళ్లు మాత్రం ఈ నీళ్లలో వ్యాధులను తగ్గించే ఔషధ గుణాలున్నాయని నమ్ముతున్నారు.
Check Also
Jaipur” మంటలలో కాలుతూ దూసుకెళ్లిన కారు.. వీడియో
Jaipur” మంటల్లో కాలుతున్న కారు రోడ్డుపై దూసుకెళ్లింది. ముందుకెళ్తున్న క్రమంలో డివైడర్‌ను ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ఘటన రాజస్తాన్‌లోని …