Thursday , 5 December 2024
Brs Mp List

Brs Mp List” న‌లుగురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్

కరీంనగర్‌కు వినోద్‌ కుమార్‌.. ఖమ్మంలో నామా
మహబూబాబాద్‌ దక్కించుకున్న మాలోత్‌ కవిత
పెద్దపల్లికి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ 
Brs Mp List” పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే తెలంగాణాలో రాజ‌కీయ వాతావ‌ర‌ణ వేడెక్కింది. త్వరలో జరుగనున్న లోక్‌స‌భ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. మొద‌టి జాబితాలో నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్ర‌క‌టించారు. కరీంనగర్ స్థానానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లిలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం బ‌రిలో ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబూబాద్‌ స్థానానికి ప్ర‌స్తుత ఎంపి మాలోత్‌ కవిత పేర్లను ఖ‌రారు చేస్తూ ప్రకటించారు. ఆదివారం, సోమవారాల్లో నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నాయ‌కుల‌తో (Brs Mp List) బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలపై నేతలతో చర్చించారు. సమిష్టి నిర్ణయంతో తొలి జాబితాలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికల బరిలో పోటీలో ఉండ‌బోతున్న అభ్యర్థులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, కవిత పాల్గొన్నారు. అభ్యర్థులను ప్రకటించిన త‌రువాత (Brs Mp List) బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ విూడియాతో మాట్లాడారు. కరీంనగర్‌ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెడతామ‌ని చెప్పారు. త్వరలోనే ఖమ్మంలో కూడా భారీ బహిరంగ సభ ఉంటుంద‌ని తెలిపారు. పార్టీ ఓడిపోయిందని ఎవరూ అధైర్యపడొద్ద‌ని సూచించారు. పార్టీ వీడి వెళ్లే వారితో (Brs Mp List)  బీఆర్‌ఎస్‌కు ఎలాంటి నష్టం లేద‌ని స్ఫ‌ష్టం చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Cheetah Viral Video” పాపం చిరుత .. బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత.. వీడియో వైర‌ల్

ఐక్య ఉద్యమాల తోనే కాపుల రాజ్యాధికారం

Bjp Mp list” బీజేపీ ఎంపీ అభ్య‌ర్థులు ఖ‌రారు..

About Dc Telugu

Check Also

05.12.2024 D.C Telugu Cinema

05.12.2024 D.C Telugu Morning

04.12.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com