Bjp Mp list” రాబోయే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి (Bjp Mp list) బీజేపీ 195 మంది అభ్యర్థులతో తన తొలి లిస్ట్‌ను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి 9 మందికి ఈ జాబితాలో అవకాశమిచ్చింది. కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్‌లలో సిట్టింగ్‌లకు అవకాశం కల్పిచింది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బరిలోకి దించింది. మొదటి జాబితాలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావ్ పేరు కనిపడలేదు. నల్గొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, మెదక్, ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉన్నది.
సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
కరీంనగర్ – బండి సంజయ్
హైదరాబాద్ – మాధవీలత
మల్కాజ్‌గిరి – ఈటల రాజేందర్
నాగర్ కర్నూల్ – భరత్ గౌడ్
భువనగిరి – బూర నర్సయ్య గౌడ్
నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్
చేవేళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జహీరాబాద్ – బీబీ పాటిల్
2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే బిజెపి అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @TawdeVinod గారు ప్రకటించారు. అందులో భాగంగా తెలంగాణలోని 9 లోక్ సభ స్థానాలకు బిజెపి అభ్యర్థులను ఖరారు చేశారు.
విజయీభవ!#PhirEkBaarModiSarkar pic.twitter.com/pniwtG1J97
— BJP Telangana (@BJP4Telangana) March 2, 2024
Viral Video” కరెంట్ షాక్ కొడుతుందా… ఏనుగు తెలివి వేరే లెవల్… వీడియో వైరల్
Gautam Gambhir” రాజకీయాల నుంచి తప్పుకుంటున్న: గౌతమ్ గంభీర్