రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి

రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను దుఃఖంలో ముంచుతున్నాయి. ప్రమాదాల్లో అభం శుభం తెలియని చిన్నారులు కూడా మృతి చెందుతున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద సోమవారం ఘోర రోడ్డు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మ‌ర‌ణం చెందారు. సోమవారం తెల్లవారుతుండ‌గా కొత్తకోట వద్ద నేష‌నల్ హైవేపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో అక్క‌డికక్కడే కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మ‌ర‌ణించారు. ఇదే కారులో ఉన్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయ సహకారాలను అందించారు. గాయ‌ప‌డ్డ వారిని సవిూపంలోని ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ‌ వారిలో ముగ్గురు పరిస్థితి సీరియ‌స్‌గా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి నిద్ర మత్తు, అతివేగమే కారణంగా తెలుస్తోంది. పోలీసులు కూడా ప్రాథమికంగా ఇదే నిర్దారించారు. బళ్లారి నుంచి హైదరాబాదుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్న‌ట్టు పోలీసులు ధ్రువీకరించారు వాసి (1), బుష్రా (2), మరియా (4), ఫాతిమా (50), అబ్దుల్‌ రెహమాన్‌ (30) గా గుర్తించారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Brs Mp List” న‌లుగురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్

Cheetah Viral Video” పాపం చిరుత .. బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత.. వీడియో వైర‌ల్

ఐక్య ఉద్యమాల తోనే కాపుల రాజ్యాధికారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *