300 అడుగుల లోతు లోయలో బస్సు పడి 36 మంది చనిపోయిన ఘటన జమ్మూ కాశ్మీర్‌లో చోటు చేసుకుంది. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నది. వివరాల్లోకి వెళ్తే.. కిష్వాడ్ నుంచి జమ్మూ వెళ్తున్నబస్సు దోడా జిల్లాలో బటోత్ కిస్తాడ్ జాతీయ రహదారిపై చీనాబ్ నది కాలువలో పడిపోయింది. కిష్త్వాడ్ నుంచి 50 మంది ప్రయాణికులతో బుధవారం ఉదయం బస్సు బయలుదేరింది. తంగాల్ అస్సారు కు ఏరియాకు రాగానే ఒక్కసారిగా కంట్రోల్ తప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని తరలించేందుకు హెలికాప్టర్ పంపుతున్నామని మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. గాయపడ్డ వారికి రూ. 50 వేలు అందజేయనున్నట్టు తెలిపారు.
వాగులో మునిగి ముగ్గురు, రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం