ప్రేమికుల ఆత్మ‌హ‌త్య

వారి ప్రేమ‌కు పెద్ద‌లు అడ్డుచెప్ప‌డంతో మ‌న‌స్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏటూరు మండ‌ల కేంద్రానికి చెందిన బెజ్జంగి రాజేశ్ (24), మంగపేట మండ‌లం క‌మ‌లాపురం గ్రామానికి చెందిన శిరీష ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. రెండెండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విష‌యం వారి కుటుంబ స‌భ్యుల‌కు తెలిసింది. పెద్ద వారు పెండ్లికి నిరాకరించారు. మ‌న‌స్థాపానికి గురై రాజేశ్, శిరీష ఇద్ద‌రు మంగ‌ళ‌వారం పురుగుల మందుతాగారు. పురుగుల మందు తాగిన‌ట్టు వారి కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు. కుటుంబ స‌భ్యులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధ‌వారం మృతి చెందారు.

 

వాగులో మునిగి ముగ్గురు, రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం

హైద‌రాబాద్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం.. 9 మంది మృతి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *