తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు 30 న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణాలోని పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ఇవ్వనున్నారు. ఒక రోజు ముందు నవంబర్ 29, ఎన్నికల రోజు నవంబర్ 30 న సెలవులు ఉండనున్నాయి. ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. 29 వ తేదీన ఉదయం 7 గంటల లోపు సిబ్బంది ఉపాధ్యాయులను ఈవీఎంలను తీసుకునేందుకు రిపోర్ట్ చేయాలి. అందుకోసమే 29,30 తేదీల్లో పాఠశాలలకు సెలవులని విద్యాశాఖ వర్గాల నుంచి సమాచారం. ఈ విషయన్ని ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.
కింద ఉన్న హెడ్‌లైన్లను క్లిక్ చేసి పూర్తి వార్తలను చదవండి
వాగులో మునిగి ముగ్గురు, రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
ఆరు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టిన లారీ.. 30 కిలోమీటర్లు ఈడ్చుకెల్లి..
ఏందన్నా ఇది.. టపాకాయలు అమ్మడానికా..? పేల్చడానికా…? బండ్ల గణేశ్ వాకింట్లో బాంబులే బాంబులు