Digital Arrest News” సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఎంతో పగడ్బందీగా సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకున్నాఅమాయకులు మోసపోతూనే ఉన్నారు. పోలీసులు నిత్యం ఎంత అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో ఓ చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని అయిన ఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ పేర నేరగాళ్లు రూ.10 కోట్లు కొల్లగొట్టారు. దేశరాజధాని ఢిల్లీలోని రోహిణి ఏరియాకు చెందిన 70 సంవత్సరాల రిటైర్డ్ ఇంజనీర్‌ని సైబర్ మాయగాళ్లు 8 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. తాము ముంబై పోలీస్ ఆఫీసర్లమంటూ సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. డ్రగ్స్ పార్శిల్ వచ్చింది. అది మీ పేరు మీదనే ఉంది. అంటూ బెదిరింపులకు గురిచేశారు. వీడియో కాల్ చేయాలని స్కైప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ భయపెట్టారు. నేరగాళ్ల సూచనలు ప్రకారం వ్యక్తగత ఇన్పర్మేషన్ ఇచ్చాడు. ఈ రకంగా 8 గంటల పాటు బెదిరింపులకు గురిచేశారు.నిషేధిత మందుల పార్శిల్ తైవాన్ దేశం నుంచి వచ్చిందని, దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని హడలెత్తించారు. ఒక రూంలో బందిఅయినట్టు ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కెమెరా ఎదుట కూర్చోవాలని సూచించారు. దీని తర్వాత మరొక గ్రూప్ కాల్ చేసి సాయం చేస్తామని నమ్మకం కలిగించారు. ఈ క్రమంలోనే ఇంజనీర్ కు బ్యాంక్ ఖాతా నుంచి రూ. 10 కోట్ల 30 లక్షలను కొట్టేశారు. నగదు బదిలీ కాగానే నేరగాళ్లు ఫోన్ కట్ చేశారు. కొద్దిసేపటికీ తేరుకున్న బాధితుడు లబోదిబోమంటూ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 60 లక్షల రూపాయలు మొత్తాన్ని స్తంభింప చేశారు. మిగిలిన డబ్బును వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
16.11.2024 D.C Teludu Cinema News
15.11.2024 D.C Telugu Crime news
Sabarimala Special trains” శబరిమలకు స్పెషల్ రైళ్లు
Viral Video” ఓరినాయనో.. ఇదెక్కడి స్టంట్.. వీడియో వైరల్
Jagityal Car accident”5 నిమిషాల్లో ఇంటికి ఇంతలోనే ఘోర ప్రమాదం..
Viral Video” బైక్ ఏజెన్సీలోకి చొరబడిన ఎద్దు.. ఎర్ర షర్ట్ వేసుకున్న వ్యక్తిని పై.. వీడియో వైరల్