తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిష్టాత్మకమైన రోడ్ కం రైల్ బ్రిడ్జి మూసివేయనున్నారు. నెల రోజుల పాటు ఈ బ్రిడ్జికి మరమ్మత్తులు చేయనున్నారు. రేపటి నుంచి అక్టోబర్ 26 రాజమండ్రి రోడ్ కం రైల్ వంతెన మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. తూర్పు గోదావరి జిల్లా సెంట్రల్ క్యారేజ్‌వేకి రోడ్‌కం రైల్ బ్రిడ్జి మరమ్మతులతో పాటు వయాడక్ట్ భాగం అప్రోచ్‌లతో సహా దెబ్బతిన్న సెకండరీ జాయింట్లకు పనులు చేయనున్నారు. ఈ పనులకు గానూ నెల రోజులు ఈ బ్రిడ్జి మూసివేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బ్రిడ్జిపై ట్రాఫిక్ మళ్లింపు చేయనున్నట్టు కలెక్టర్ మాధవీలత తెలిపారు. వాహనాలను దారి మళ్లించేందుకు ట్రాఫిక్ పునరుద్ధరణ చేయాలని అధికారులు భావించారు. త్వరగా మరమ్మతులు పూర్తి చేసి, వాహనాల రాకపోకలకు ఏ ఇబ్బంది కలగకూడదని నిర్ణయించారు. ఈ దారిలో ట్రాఫిక్ నియంత్రించ డంతో పాటు ఆల్టర్నేట్ మార్గాలను ట్రాఫిక్ పోలీసులు సూచించనున్నారు. తూర్పుగోదావరి పోలీసు సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం, కొవ్వూరు ల నుంచి ట్రాఫిక్ మళ్లింపులో చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని విద్యా సంస్థలకు ఈ వంతెన తాత్కాలిక మూసివేతపై ముందుగా సమాచారం తెలపాలని ఆదేశించారు.
మొన్నటిదాకా కోట్లు కురిపించి.. నేడు రూపాయి రావడం లేదు..