గత మే నెలలో రూ.2 వేల నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు రూ. 2 వేలను నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి టైం ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజుల్లో ఈ సమయం ముగియనుంది. అందులో ఒక రోజు బ్యాంకులకు సెలవు ఉంది. 26,27 బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. 28 రోజు సెలవు ఉండనుంది. 29, 30 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి. ఈ నాలుగు రోజుల్లోనే రూ. 2 వేల నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నోట్ల మార్పిడికి పెట్టిన గడవును రిజర్వ్ బ్యాంకు మరికొంత కాలం అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు చివర్లో సెలవుల నేపథ్యంలో రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు ఇంకో రెండువారాల గడువు ఇచ్చే అవకావం ఉందని అంచాన వేస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మే 19న రూ. 2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. అయితే ఈ నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా వాటిని బ్యాంకుల్లో మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు ప్రజలకు సమయం ఇచ్చింది. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను ఇప్పటికే మార్చుకున్నారు. బ్యాంకుల నుండి అందిన డేటా ప్రకారం, సెప్టెంబరు 1 నాటికే రూ.3.32 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు ఆర్‌బీఐ వద్దకు చేరాయి. దీంతో దేశంలో చలామణిలోకి పంపిన రూ.2వేల నోట్లలో 93 శాతం తిరిగి వచ్చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే వెల్లడించింది.
మా వార్త విశ్లేషణలు మీకు నచ్చినట్టయితే పక్కనున్న గంట గుర్తు నొక్కి నోటిఫికేషన్స్ అలో అనండి
ఇవి కూడా చదవండి