వయనాడ్ నుంచే రాహుల్ మరోమారు పోటీ
తిరువనంతపురం బరిలో మరోమారు శశిథరూర్
ఛత్తీస్‌ఘడ్ నుంచి మాజీ సెం భూపేశ్ భగేల్ పేరు
తెలంగాణ నుంచి నాలుగు పేర్లు ప్రకటన
నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్
తొలి జాబితలో చోటు దక్కని వంశీచంద్ పేరు
జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్
చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డికి చోటు
మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్
Congress First List” లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం కాంగ్రెస్ ప్రకటించింది. తొలిజాబితాలో దేశ వ్యాప్తంగా 36 మంది పేర్లు ప్రకటించారు. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ మరోమారు పోటీ చేస్తారు. మొదటి జాబితాలో ఆయన పేరును ప్రకటించారు. తిరువనంతపురం నుంచి శశిథరూర్ మరోసారి పోటీ లో ఉన్నారు. ఛత్తీస్‌ఘడ్ మాజీ సిఎం భూపేశభగేల్ ఎంపిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుత జాబితాలో కర్నాటక, కేరళలోనే ఎక్కువ స్థానాలను ప్రకటించారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ (Congress First List) స్థానాలకు కేవలం నలుగురు అభ్యర్థులను మాత్రమే కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ స్థానాన్ని ప్రకటించకుండా కాంగ్రెస్ అధిష్టానం నలుగురి జాబితా ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి పేర్లు జాబితాలో ఉన్నాయి. కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్ రాష్టాల్ల్రో అభ్యర్థులను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలకు గడువు సవిూపిస్తున్న తరుణంలో ఏఐసీసీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. ఢిల్లీలో టీపీసీసీ నేతలతో కాంగ్రెస్ సీఈసీ సమావేశం అయ్యింది. రాహుల్ గాంధీ కేరళ వాయనాడ్ నుంచి పోటీ చేస్తారని (Congress First List) ఏఐసీసీ స్పష్టం చేసింది. ఇక మార్పు చేర్పులు పూర్తి అయ్యాక, తుది జాబితాను ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ నుంచి 7 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యినట్లు సమాచారం వచ్చినా ఎందుకనో నాలుగుసీట్లను మాత్రమే ప్రకటించారు. చేవెళ్ల నుంచి మాజీమంత్రి పి.మహేందర్ రెడ్డి భార్య సునీతా మహేందర్ రెడ్డి పేరును ప్రకటించారు. వీరిద్దరూ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఆమె జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. గురువారం ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జై రాం రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ (Congress First List) కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీకి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో తెలంగాణ నుంచి పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. నియోజకవర్గాల వారీ బలాబలాలు, సామాజిక సవిూకరణల ప్రకారం అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. పదిమంది పేర్లతో తొలి జాబితా విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. మహబూబ్‌నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో మిగతా 16 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా వెలువడాల్సి ఉంది. కాగా, సికింద్రాబాద్, పెద్దపల్లి, నల్గొండ, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం.
కేరళ- తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఖరారు చేసేందుకు నిర్వహించిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేరళ వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో రాహుల్ వయనాడ్‌తో పాటు అమేథీలో కూడా పోటీ చేశారు. అమేథీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ రాహుల్ గాంధీని ఓడించారు. అమేథీలో ఓడినా వాయనాడ్‌లో మాత్రం ఘన విజయం సాధించారు. అయితే ఈసారి వాయనాడ్‌లో ఇండియా కూటమి మిత్రపక్షం సీపీఐ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిందని, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి అనీ రాజాను అభ్యర్థిగా ప్రకటించారని ప్రచారం జరిగింది. దీంతో రాహుల్‌ను తెలంగాణ నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు తెలంగాణ పీసీసీ ప్రయత్నించింది. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ రాహుల్ వయనాడ్ నుంచే పోటీ చేస్తారని ఏఐసీసీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ తొలి జాబితాలో తిరువనంతపురం నుంచి శశి థరూర్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పేర్లు కూడా చేరాయి. ఈ ఇద్దరు అనుభవజ్ఞుల పేర్లను కూడా మొదటి జాబితాలో చేర్చడం విశేషం. బీజేపీ ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తోంది. ఈ తరుణంలో ఏఐసీసీ కేవలం నలుగురి పేర్లతో తొలి జాబితా విడుదల చేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
Lpg Cylinder Prices” వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. విపక్షాలు ఏమన్నాయంటే…?
Scorpio Viral Video” వామ్మో స్కార్పియోలో ఇంత మందా…? నోరెళ్లబెట్టిన నెటిజన్లు..
Tspsc Exams” గ్రూప్ పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ