good thief” సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. తాళం వేసి ఉన్న ఓ హోటళ్లో ఓ వ్యక్తి దొంగతనానికి వచ్చాడు. చాలా పకడ్బందీగా ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు వేసుకొని వచ్చాడు. తాళం పగలగొట్టి లోపలకి వెళ్లాడు. హోటల్ అంతాకలియ తిరిగాడు. ఎక్కడా ఏం దొరకలేదు. అటుఇటు తిరిగాడు. ఏం దొరకకపోవడంతో నిరాశ చెందాడు. సీసీ కెమెరా వద్దకు వచ్చి ఆవేదన చెందాడు. ఒక్క రూపాయి కూడా లేదంటూ కెమెరా ముందు సైగ చేస్తూ వాపోయాడు. చివరకు ఫ్రిడ్జ్‌లో నుంచి ఓ వాటర్ బాటిల్ తీసుకుని దానికి రూ. 20 లు టేబుల్ వద్ద పెట్టి వెళ్లాడు. ఇదంతా హోటల్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు.. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఓ హోటల్‌లో చోటు చేసుకుంది. దీనిని తెలుగు స్క్రయిబ్ వారి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
దొంగతనానికి వచ్చిన దొంగకు నిరాశ.. ఇంట్లో ఏమి లేవని సీసీటీవీలో ఆవేదన
ఇంట్లో ఏమి లేవని వాటర్ బాటిల్ తీసుకొని రూ.20 పెట్టి పోయిన దొంగ
రంగారెడ్డి – మహేశ్వరంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దొంగకు ఏమి దొరకలేదు.. దీంతో నిరాశ చెంది సీసీటీవీలో తన ఆవేదన తెలిపాడు.
చివరకు… pic.twitter.com/cZlfswpiwp
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2024
ఇవి కూడా చదవండి
Cyber crime news” రూపాయికి వందవస్తుందంటే అనుమానించాల్సిందే..వీడియో
Khammam News” ఖమ్మంలో ఘోరం..తడి చేతులతో ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. 9 ఏండ్ల బాలిక మృతి
Delhi News” దేశ రాజధానిలో నడిరోడ్డుపై పట్టపగలు.. ఎంతకు తెగించారంటే.. వీడియో
atal setu”15 సెకన్లలోనే ఆత్మహత్య .. సీసీవీడియో
Mumbai Local Train” కదులుతున్న ట్రయిన్‌నుంచి కిందపడిన వ్యక్తి… వీడియో