Young Aspirant” ఆశ‌ల ప‌రుగు ఆగింది.. పోలీసు ఉద్యోగానికి శిక్షణ తీసుకుంటున్న యువకుడు… ఉహించ‌ని విషాదం

Young Aspirant”  తిరుపతి జిల్లా నాగలపురం మండలంలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భవిష్యత్తుపై ఆశలతో ఎదురు చూస్తున్న ఒక యువకుడు… నిత్యం పోలీసు ఉద్యోగానికి శిక్షణ తీసుకుంటూ తన లక్ష్యాన్ని చేరుకోవాలని కృషి చేస్తూ… ఆకస్మికంగా గుండెపోటుతో బలయ్యాడు.

సురుటుపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ (21) తన స్నేహితులతో కలిసి రన్నింగ్ చేస్తూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దగ్గరలో ఉన్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే గుండెపోటు కారణంగా అతడు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు.

భాస్కర్ ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి పోలీస్ శాఖలో ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ, ప్రతి రోజు ఉదయాన్నే శారీరక శిక్షణకు సమయం కేటాయించేవాడు. నిరుద్యోగ యువతలో ఆయన ఓ మార్గదర్శకుడిగా, ప్రేరణగా మారాడు. కానీ, ఒక్కసారిగా వచ్చిన హృదయ ఆఘాతంతో అతని కలలన్నీ అక్కడికక్కడే ఆగిపోయాయి.

ఈ విషాద ఘటనతో భాస్కర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తన కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని, పోలీస్ ఉద్యోగం ద్వారా మద్దతుగా నిలవాలని కలలు కన్న యువకుడి పోరాటానికి ఇదే ముగింపు కావడం గుండెను తట్టేస్తోంది.

Narzo 80 Pro 5G ” రియల్‌మీ గేమింగ్‌కి కొత్త డెఫినిషన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *