ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 కోసం ముంబై వేదికగా వేలం జరుగుతోంది. ఈ బిడ్డింగ్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అన్నాబెల్ సదర్లాండ్ జాక్ పాట్ కొట్టింది. రూ.40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆమె కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. దీంతో బిడ్డింగ్ ఆసక్తికరంగా సాగింది. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఏకంగా.. రూ.2 కోట్లతో అనాబెల్‌ను సొంతం చేసుకుంది. 22 ఏళ్ల ఆల్ రౌండర్ అయిన అన్నాబెల్ సదర్లాండ్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున 22 టీ20 మ్యాచ్‌లు ఆడింది. 97 పరుగులతో పాటు 10 వికెట్లు తీసింది. అలాగే 23 వన్డే మ్యాచ్‌ల్లో 342 రన్స్‌తో పాటు 22 వికెట్లు తీసింది. ఇక 3 టెస్ట్ మ్యాచుల్లో 170 పరుగులతో పాటు ఆరు వికెట్లు నేలకూల్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాక ముందు బిగ్ బాష్ లీగ్ లో మెరుపులు మెరిపించింది సదర్లాండ్. నిలకడగా పరుగులు చేయడంతో పాటు వికెట్లు తీయగలిగింది. టీ 20 స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన అన్నాబెల్ ఇప్పుడు వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బంపరాఫర్ కొట్టేసింది. ఢిల్లీ ఆమెను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర కావడం విశేషం.
అలిస్ క్యాప్సే, అరుంధతీ రెడ్డి, జెమీమా రోడ్రిగ్జ్, జెస్ జొనాస్సెన్, లారా హారిస్, మరిజాన్నె కాప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియాస్ భాటియా. ఈ మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత క్రికెటర్లు వేద కష్ణ మూర్తి, పూనమ్ రౌత్, దేవికా వైద్య, ఎస్ మేఘనతోపాటు భారతి ఫుల్మాలి, మోనా మెష్రామ్ తదితరలకు నిరాశ ఎదురైంది. వీరి కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. అయితే ఫైనల్ రౌండ్ వేలంలో అవకాశం వస్తుందో లేదో చూడాలి.
చీలమండలో గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్న లుంగి ఎంగిడి
ఆసీస్ క్రికెట్ బోర్డు కంటే బీసీసీఐ ఆదాయం దాదాపు 28 రేట్లు అధికం
ఉర్లగడ్డ.. ఉల్లిగడ్డ.. పొటాటోను ఏమంటారు..? వైసీపీ వర్సెస్ టీడీపీ