development” రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి — కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి

development”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.

శనివారం తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును వారు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలని, అభివృద్ధికి రాజకీయాలు అడ్డుకాకూడదని వ్యాఖ్యానించారు. మానకొండూర్ నియోజకవర్గానికి తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి సింహభాగం కేటాయించనున్నట్లు తెలిపారు.

అలానే గన్నేరువరం నుండి కరీంనగర్ వరకు రహదారి దూరం తగ్గించేందుకు మానేరుపై వంతెన అవసరమని పేర్కొంటూ, సంబంధిత నిధుల కోసం కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీను కలిశామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో పార్టీ భేదాలు పక్కనపెట్టి అన్నదమ్ములలా కలిసి పనిచేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి సహకారంతో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో  మండల తహసీల్ధార్ కె.శ్రీనివాస్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి విజయ్ కుమార్, పంచాయతీరాజ్ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ మంజుల భార్గవి, ఓఈ సురేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, పార్టీ నాయకులు సుధగోని లక్ష్మినారాయణగౌడ్, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, కుంట రాజేందర్ రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, బుధారపు శ్రీనివాస్, ఎస్.కొండల్ రావు, చింతల లక్ష్మారెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, గొట్టెముక్కుల సంపత్ రెడ్డి, గుంటి భూమయ్య,పోలు రాము, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *