Digital cards” తెలంగాణాలో డిజిటల్ కార్డులు తీసుకరావాలని సర్కార్ భావిస్తున్నది. ప్రజెంట్ ఉన్న రేషన్, ఆరోగ్య శ్రీ కార్డులతోపాటు మిగితా అన్నీ సేవలకు ఒకటే కార్డు తీసుకురావాలని నిర్ణయించింది. ఒకటే కుటుంబ డిజిటల్ కార్డును ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం కార్డుల విధివిధానాలు, కార్డుల జారీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌లో శనివారం సవిూక్ష సమావేశం ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ జారీ చేసే కుటుంబ డిజిటల్ కార్డులో ఇంటి యజమానిగా మహిళనే గుర్తిస్తామన్నారు. ఫ్యామిలీ మెంబర్ల పేర్లు, వారి పూర్తి వివరాలున్నింటినీ కార్డు వెనుకభాగంలో పొందుపర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 3వ తారీఖు నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌గా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆయా అధికారులకు సూచించారు. ఈ డిజిటల్ కార్డులోనే ఆరోగ్య, రేషన్, మిగితా పథకాలకు సంబంధించిన లబ్దిదారుల పూర్తి వివరాలు ఉంటాయని చెప్పారు. ఈ మీటింగ్‌లో మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
Samsung Phones” బ్రాండెడ్ సాంసంగ్ ఫోన్లపైనా భారీ తగ్గింపు.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో..
32 inch TV” 32 ఇంచుల టీవీ కేవలం రూ.9,499కే.. అమెజాన్లో ఆఫర్లే.. ఆఫర్లు..