AaOkkatiAdakku” ఇటు కామెడీ, అటు సీరియస్ స్క్రిప్ట్‌లతో అలరించే హీరో అల్లరి నరేష్. కొంత కాలం నుంచి సీరియస్ కథలపై దృష్టి సారించారు. తనకు గుర్తింపు తెచ్చిన కామెడీ జోనర్ ను మళ్లీ ఎంచుకున్నారు. ‘ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో ఇప్పుడు అభిమానుల ముందుకు వచ్చారు. మల్లి అంకం ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు.
టీజర్ తో పాటు ట్రైలర్ ప్రేక్షకుల్లో ఇంట్రస్ట్‌ను పెంచాయి. ఈ చిత్రం కోసం ఈవీవీ క్లాసిక్ టైటిల్‌ను వాడుకోవడం మరోక విశేషం. హీరో నరేష్ గణపతి అలియాస్ గణ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో అధికారి. జీవితంలో సెటిల్ అయినప్పటికీ తనకింకా పెండ్లి కాదు. పెండ్లి సంబంధాలు వచ్చినట్టే వచ్చి రిజెక్ట్ అవుతుండడం కాన్సెప్ట్. తన తమ్ముడికి కూడా మ్యారేజ్ అయ్యింది. కానీ నరేష్ పెండ్లి కోసం ట్రయి చేస్తూనే వుంటాడు. లాస్ట్ ప్రయత్నంగా హ్యాపీ మాట్రిమొనీలో సంప్రదిస్తాడు. అక్కడివారు చూపెట్టిన మ్యాచ్ లో గుణకి సిద్ది (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం అవుతుంది. నరేష్‌కు తొలి చూపులోనే బాగా నచ్చుతుంది. కానీ సిద్దికి మాత్రం ఇంకా తొమ్మిది అవకాశాలు ఉన్నాయని, అన్నింటీన్నీ చూశాకే ఒక నిర్ణయం తీసుకుంటానని గుణని వెయిటింగ్ లిస్టు లో పెడుతుంది. మరి సిద్ది, గుణతో పెళ్ళి అయ్యిందా.? అసలు సిద్ది ఎవరు..? లైఫ్‌లో సెటిల్ అయిపప్పటికీ గణకి పెళ్లి ఎందుకు ఆలస్యం అయ్యింది.? చివరికి గణ వివాహం చేసుకున్నాడా లేదా ? అనేది మిగతా కథ. వివాహం అనేది ఒక ఎమోషనల్ బాండ్. ఈ ఎమోషన్ ని క్యాష్ చేసుకొని కొన్ని మ్యాట్రీమొనీ కంపెనీలు ఎటువంటి మోసాలకు పాల్పడుతున్నాయనేది కథ. వివాహం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండలానే అంశాలని వినోదాత్మకంగా చెబుతూనే మంచి సందేశం ఇచ్చిన సినిమాది.
ఇవి కూడా చదవండి
Ts Rtc” ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్
Hariharaveeramallu Movie” హరిహరవీరమల్లు టీజర్ విడుదల
Pondicherry News” సిగ్నల్ వద్ద ఈ ఏర్పాటు అదుర్స్.. వీడియో వైరల్
Bulls Viral Video”బట్టల షాపును నిండాముంచిన ఎద్దుల కొట్లాట.. వీడియో వైరల్