Karimnagar news” ఎండ వేడికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నరు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నో ఉపాయాలు చేస్తుంటారు. పది దాటిందంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకెళ్తే కొద్దిసేపటికే నీడ వద్ద సేద తీరుతున్నరు. ఇంత భయకరంగా సంపుతున్న ఎండల నుంచి కొంతమందికైన ఊరట కలిగించేందుకు ఓ పెట్రోల్ బంక్ ఓనర్ వినూత్న ఆలోచనకు తెరతీశాడు. తన బంక్‌లోకి పెట్రోల్ కోసం వచ్చినోళ్లకు కూల్ అయ్యేందుకు ఏర్పాటు చేశాడు. పెట్రోల్ బంక్ పై భాగంలో స్పింక్లర్ల ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండ వేడి తగ్గే వరకు జల్లులు కురిపిస్తున్నరు. పెట్రోల్ బంక్‌లో కి వచ్చేవారితో పాటు అటుగా వచ్చిన వాహనదారుల కూడా కాసేపు సేద తీరుతున్నారు. ఈ ఏర్పాటు (Karimnagar news) కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌లో ఏర్పాటు చేశారు. జ్యోతినగర్ నుంచి శాతావాహన యూనివర్సిటీ, మల్కాపూర్ వైపు వెళ్లే దారిలోని పెట్రోల్ బంక్ యజమాని ఈ ఏర్పాటు చేశారు. దీనిపై అందరూ ప్రశంసిస్తున్నారు. మంచి ఏర్పాటు చేశారు. మీకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Naveen Kumar Tallam అనేవారు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
#Karimnagar To beat the heat waves, a petrol pump owner arranged a water mist fog system around the petrol pump, customers while purchasing petrol their feeling of cool fog water dropping on them. Bharat Petrolium retailer outlet at Satavahana University Road attracts every.… pic.twitter.com/Rx8i1MkZfK
— Naveen Kumar Tallam (@naveen_TNIE) May 2, 2024
ఇవి కూడా చదవండి
AaOkkatiAdakku” వినోదాత్మకంగా ఆ ఒక్కటీ అడక్కు
Ts Rtc” ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్
Pondicherry News” సిగ్నల్ వద్ద ఈ ఏర్పాటు అదుర్స్.. వీడియో వైరల్
Deer Viral Video”జీవితం అంటే ఏమిటి……ఎప్పటికీ ఆశ వదులుకోవద్దు..వీడియో వైరల్