ఆదివారం ఉదయం కేరళంలో రాష్ట్రంలోని ఏర్నాకులంలో బాంబుపేలుళ్లు సంభవించాయి. ఎర్నాకుళం జిల్లా కాలమస్సేరి లోని ఓ ప్రార్థనా మందిరం వద్ద ఈ పేళుల్లు చోటు చేసుకున్నాయి. ఈ పేళుల్లలో ఒకరు దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. గాయాలయిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక్కడి ప్రార్థనా మందిరంలో వరుసగా మూడు రోజులు సమావేశాలు నిర్వహిస్తారు. పేలుడు జరిగిన సమయంలో ఇక్కడ 2 వేల మందికి వరకు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనను ఉగ్రదాడి కోణంలో విచారిస్తున్నారు. గాయపడ్డవారిలో ఏడుగురికి చాలా సీరియస్‌గా ఉంది. లీవ్‌లో ఉన్న డాక్టర్లు వెంటనే డ్యూటీలో చేరాలని కేరళ రాష్ట్ర హెల్త్ మినిష్టర్ మంత్రి వీణా జార్జి ఆదేశించారు. ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. పేలుళ్లపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 36 మంది హాస్పిటల్‌లో చేరారు.
భార్యను చంపి.. రోడ్డు ప్రమాదంగా నమ్మించి.. ప్రియురాలి భర్తను చంపి.. సినిమాను తలపించే స్టోరీ