కేర‌ళ‌లో బాంబు పేలుళ్లు.. ఒక‌రి మృతి

ఆదివారం ఉద‌యం కేర‌ళంలో రాష్ట్రంలోని ఏర్నాకులంలో బాంబుపేలుళ్లు సంభ‌వించాయి. ఎర్నాకుళం జిల్లా కాల‌మ‌స్సేరి లోని ఓ ప్రార్థ‌నా మందిరం వ‌ద్ద ఈ పేళుల్లు చోటు చేసుకున్నాయి. ఈ పేళుల్ల‌లో ఒక‌రు దుర్మ‌రణం చెందారు. మరో 20 మంది గాయాల‌పాల‌య్యారు. గాయాల‌యిన వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇక్క‌డి ప్రార్థ‌నా మందిరంలో వరుస‌గా మూడు రోజులు స‌మావేశాలు నిర్వ‌హిస్తారు. పేలుడు జ‌రిగిన స‌మ‌యంలో ఇక్క‌డ 2 వేల మందికి వ‌ర‌కు ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌ను ఉగ్రదాడి కోణంలో విచారిస్తున్నారు. గాయ‌ప‌డ్డ‌వారిలో ఏడుగురికి చాలా సీరియ‌స్‌గా ఉంది. లీవ్‌లో ఉన్న డాక్ట‌ర్లు వెంట‌నే డ్యూటీలో చేరాల‌ని కేరళ రాష్ట్ర హెల్త్ మినిష్ట‌ర్ మంత్రి వీణా జార్జి ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌పై కేర‌ళ సీఎం పిన‌రయి విజ‌య‌న్ స్పందించారు. పేలుళ్ల‌పై విచార‌ణ చేస్తున్న‌ట్టు చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు 36 మంది హాస్పిట‌ల్‌లో చేరారు.

భార్య‌ను చంపి.. రోడ్డు ప్ర‌మాదంగా న‌మ్మించి.. ప్రియురాలి భ‌ర్త‌ను చంపి.. సినిమాను త‌ల‌పించే స్టోరీ

పులి మెడ‌కు తాడు క‌ట్టి.. సాధు జంతువు వ‌లె రోడ్డు మీద.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *