ప్రభుత్వ ఉద్యోగులు అనుమతి లేకుండా సెకెండ్ మ్యారేజ్‌చేసుకోకూడదని అసోం గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ మాట్లాడారు. సర్వీస్ నిబంధనలకురెండో పెండ్లి పూర్తిగా వ్యతిరేకమన్నారు. కొన్ని మతాల్లో సెకెండ్ మ్యారేజ్ చేసుకునే వీలుందని, అయినప్పటికీ గవర్నమెంట్ ఉద్యోగులు తప్పని సరిగా పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. భార్యలు ఇద్దరు ఉన్న ప్రభుత్వ ఉద్యోగి చనిపోయిన తర్వాత పెన్షన్ విషయంలో వివాదాలు వస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ వివాదాలను పరిష్కరించడం ఇబ్బందిగా మారిందని ఆ రాష్ట్ర సీఎం అన్నారు. ఈ రూల్ ఇంతకు ముందే ఉన్నా తాజాగా దీనిని అమలు చేయడానికి నిర్ణయించినట్టు వివరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని డిపార్టమెంట్ల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
భార్యను చంపి.. రోడ్డు ప్రమాదంగా నమ్మించి.. ప్రియురాలి భర్తను చంపి.. సినిమాను తలపించే స్టోరీ
పులి మెడకు తాడు కట్టి.. సాధు జంతువు వలె రోడ్డు మీద.
బీసీ ముఖ్యమంత్రి అయితే.. ఈటలనా…? బండి సంజయ్ నా..? ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కీలక పదవులు..?