బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురు క్షేమంగా బయట పడ్డారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్ర‌వారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నిమ్మనపల్లి నుంచి పెద్ద కల్వలకు వెళ్తున్న నెక్సా కారు  అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్ళింది. ప్రమాదంలో రంగంపల్లికి చెందిన వినీత్‌ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న గాదె అఖిల్‌, అనురోహిత్‌ రెడ్డి, సాయిలు బావిలో నుంచి పైపు ద్వారా బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్‌ఐ మల్లేష్‌ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

also read

Crime Scene” బిడ్డ మృతికి అల్లుడే కార‌ణ‌మ‌ని కొట్టి చంపిన్రు..

ప‌టేల్స్ టోర్నీలో రాష్ట్ర‌స్థాయి విజేత జగిత్యాల

ప‌తంగి ఎగ‌ర‌వేయ‌బోయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *